కేరళలో కరోనా మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతోంది. ఆ రాష్ట్రంలో కొత్తగా 9,016 కేసులు నమోదయ్యాయి. యాక్టివ్ కేసుల సంఖ్య 96,004కి చేరింది. ఇప్పటివరకు 1,139 మంది వైరస్‌కు బలయ్యారు. 2లక్షల 36వేల 989 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు.
కర్ణాటకలో
కర్ణాటకలో కొత్తగా 7,184 మందికి పాజిటివ్‌గా నిర్ధరణ అయ్యింది. మరో 71మంది మరణించారు. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 7లక్షల 58వేల 574కు చేరింది. మృతుల సంఖ్య 10,427గా ఉంది.
తమిళనాడులో..
తమిళనాడులో మరో 4,295 మందికి పాజిటివ్‌గా తేలింది. ఒక్కరోజు వ్యవధిలో 57మంది వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. మొత్తం బాధితుల సంఖ్య 6లక్షల 83వేల 486కు చేరింది. మరణాల సంఖ్య 10,586కు పెరిగింది. 6లక్షల 32వేల 708 మంది వైరస్ నుంచి కోలుకున్నారు.
రాజస్థాన్‌లో కొత్తగా నమోదైన 1,992 కేసులతో కలిపి మొత్తం బాధితుల సంఖ్య 1లక్ష 71వేల 281కి చేరింది. ఇప్పటివరకు 1,735 మంది చనిపోయారు. ప్రస్తుతం 21,255 యాక్టివ్ కేసులున్నాయి.
మిజోరాంలో కొత్తగా ఒక్క కేసు కూడా నమోదుకాలేదని అధికారులు తెలిపారు. ఆ రాష్ట్రంలో 2,245 మంది బాధితులున్నారు. ప్రస్తుతం 108మంది మాత్రమే చికిత్స పొందుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు ఒక్క మరణం కూడా నమోదు కాలేదు.