ETV Bharat / bharat

'మహా'లో ఆగని కరోనా ఉద్ధృతి.. కొత్తగా 9వేలకుపైగా కేసులు - తమిళనాడు వైరస్​ కేసులు

దేశంలో కరోనా ఉగ్రరూపం దాల్చుతోంది. మహారాష్ట్రలో ఒక్కరోజే దాదాపు 9వేల మందికి పైగా వైరస్​ సోకింది. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లోనూ రికార్డు స్థాయిలో కేసులు వెలుగుచూస్తున్నాయి.

CORONA CASES IN TAMILANADU AND KERALA STATES
తమిళనాడులో ఒక్కరోజులోనే 6 వేల మందికిపైగా కరోనా
author img

By

Published : Jul 23, 2020, 7:21 PM IST

Updated : Jul 23, 2020, 9:09 PM IST

భారత్​లో కొవిడ్​ కేసుల పెరుగుదల తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. దేశంలోనే అత్యధికంగా కొవిడ్​ కేసులు నమోదవుతున్న మహారాష్ట్రలో... తాజాగా 9,895 మంది వైరస్​ బారిన పడ్డారు. మరో 298 మంది మహమ్మారికి బలైయ్యారు. ఫలితంగా మొత్తం కొవిడ్​ బాధితుల సంఖ్య 3,47,502కు ఎగబాకింది. ఇప్పటివరకు 12,854మంది మరణించారు. కాగా 1,94,253మంది డిశ్చార్జ్​ అయ్యారు.

తమినాట విలవిల

తమిళనాట కరోనా విలయ తాండవం కొనసాగుతోంది. ఒక్కరోజు వ్యవధిలో కొత్తగా 6,472 కొత్త కేసులు వెలుగు చూశాయి. ఫలితంగా మొత్తం వైరస్​ బాధితుల సంఖ్య 1,92,964 కు చేరింది. మహమ్మారి బారినపడి మరో 88 మంది చనిపోగా.. మొత్తం మృతుల సంఖ్య 3,232కు పెరిగింది. కాగా ఇప్పటివరకు ఆ రాష్ట్రంలో 1,36,793 మందికి వైరస్​ నయమైంది. మరో 52,939 మంది చికిత్స పొందుతున్నారు.

బెంగళూరు 2200పైగా..

కర్ణాటకలో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. ఒక్కరోజే 5,030 మందికి వైరస్​ సోకింది. మరో 97 మంది మృతి చెందారు. కాగా కేవలం బెంగళూరులోనే 2,207 కేసులు వెలుగుచూశాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కొవిడ్​​ కేసుల సంఖ్య 80,863కు చేరింది. మరణాల సంఖ్య 1,616కు పెరిగింది.

రికార్డు స్థాయిలో..

ఉత్తర్​ప్రదేశ్​లో రికార్డు స్థాయిలో ఒక్కరోజే 2,529 మందికి కరోనా పాజిటివ్​ తేలింది. మరో 35 మంది చనిపోయారు. ఫలితంగా ఇప్పటివరకు 58,104 మంది వైరస్​ బారిన పడగా... మరణాల సంఖ్య 1,298కు చేరుకుంది.

బంగాల్​లో 50 వేలు దాటిన కేసులు

పశ్చిమ బంగాల్​లో కొత్తగా 2,436మంది కరోనా సోకగా... మరో 34 మంది వైరస్​కు బలైయ్యారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 51,757కు పెరిగింది. ఇప్పటివరకు 1,255మంది కొవిడ్​తో చనిపోయారు.

పది వేలకు చేరువలో కేరళ

కేరళలో కొవిడ్​ విజృంభణ కొనసాగుతోంది. 24 గంటల వ్యవధిలో 1,078 మంది కరోనా బారినపడ్డారు. మరో 5 మంది వైరస్​ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు ఆ రాష్ట్రంలో 9,468 వైరస్​ కేసులు నమోదయ్యాయి.

దేశ రాజధానిలో ఇలా..

దిల్లీలో కొత్తగా 1,041 వైరస్​ కేసులు వెలుగుచూశాయి. 26మంది మరణించారు. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 1,27,364కు పెరిగింది. మృతుల సంఖ్య 3,745కు ఎగబాకింది. 1,09,065మంది కొవిడ్​ నుంచి రికవరీ అయ్యారు.

ఇదీ చదవండి: లైవ్​ ఫైట్: నెమలి వర్సెస్ కోడిపుంజు

Last Updated : Jul 23, 2020, 9:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.