దేశంలో కరోనా కలవరపెడుతోంది. రోజురోజుకూ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కొత్తగా 18 వేల 522 మంది వైరస్ బారినపడ్డారు. మరో 418 మంది కొవిడ్‌కు బలయ్యారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
- వైరస్ తీవ్రత అధికంగా ఉన్న మహారాష్ట్రలో కేసులు లక్షా 69 వేలు దాటాయి. మరణాల సంఖ్య 7,610గా ఉంది.
- తమిళనాడులో 86 వేల మందికిపైగా కరోనా బారినపడ్డారు. మొత్తం 1141 మరణాలు సంభవించాయి.
- గుజరాత్లో 1827, దిల్లీలో 2,680 మంది కొవిడ్ ధాటికి ప్రాణాలు కోల్పోయారు.