ETV Bharat / bharat

కరోనా ఉద్ధృతిలో స్వల్ప తగ్గుదల

దేశంలో కరోనా కేసులు, మరణాల సంఖ్యలో స్వల్ప తగ్గుదల నమోదైంది. గత 5 రోజులతో పోలిస్తే వారాంతంలో 10 శాతం కేసులు తగ్గాయి. ఆగస్టు 4 తర్వాత తొలిసారి మంగళవారం (819) తక్కువ మరణాలు సంభవించాయి.

corona cases
కరోనా ఉద్ధృతిలో స్వల్ప తగ్గుదల
author img

By

Published : Sep 2, 2020, 6:53 AM IST

దేశంలో కొవిడ్‌-19 పాజిటివ్‌ కేసుల్లో కొంత నెమ్మది కనిపించింది. వారాంతంలో పరీక్షల సంఖ్య తగ్గడంతో ఆ ప్రభావం కేసుల నమోదులోనూ కనిపించింది. గత అయిదు రోజుల్లో సగటున 77,354 కేసులు నమోదు కాగా, కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ జారీ చేసిన తాజా లెక్కల ప్రకారం మంగళవారం దేశవ్యాప్తంగా 69,921 మాత్రమే కొత్త కేసులొచ్చాయి. గత అయిదు రోజులతో పోలిస్తే దాదాపు 10% తగ్గాయి. మంగళవారం ఉదయం 8 గంటలతో ముగిసిన గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా కరోనా మరణాల సంఖ్య 819కి చేరింది. ఇంత తక్కువ మరణాలు సంభవించడం ఆగస్టు 4వ తేదీ (803) తర్వాత ఇదే ప్రథమం. దీనికి ముందు ఆరు రోజుల్లో ప్రతిరోజూ సగటున 1,013 మంది చనిపోయారు. ఆ సంఖ్యతో పోలిస్తే మంగళవారం దాదాపు 19% మరణాలు తగ్గినట్టే లెక్క. మరోవైపు గత 24 గంటల్లో 65,081 మంది కోలుకున్నారు. గత నెల 25వ తేదీ (66,550 మంది) తర్వాత అత్యధిక మంది కోలుకున్నది ఇప్పుడే. మరోవైపు క్రియాశీల కేసుల పెరుగుదల కేవలం 4,021 మేర మాత్రమే నమోదైంది. గత వారం రోజుల్లో ఇదే అత్యల్ప వృద్ధి.

పుణేలో 1.75లక్షల కేసులు

గత 24 గంటల్లో ఝార్ఖండ్‌, రాజస్థాన్‌, హరియాణాల్లో ఇదివరకు ఎన్నడూలేనంత సంఖ్యలో కొత్త కేసులొచ్చాయి. 1.75 లక్షల కేసులతో పుణే దేశంలో అత్యధిక కేసులు నమోదైన ప్రాంతంగా రికార్డు సృష్టించింది. ఇప్పటివరకు దిల్లీ పేరున ఉన్న రికార్డును అది చెరిపేసింది. పరీక్షల సంఖ్య పెంచడమే ఇందుకు కారణమని అధికారులు పేర్కొన్నారు. తాజా లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా రికవరీ రేటు 76.94, మరణాల రేటు 1.77%కి చేరింది. క్రియాశీలక కేసులు 21.29%కి పరిమితం అయ్యాయి.

5 రాష్ట్రాలు.. సగానికిపైగా కేసులు

దేశంలో కొత్తగా నమోదైన కరోనా పాజిటివ్‌ కేసుల్లో 56 శాతం అయిదు రాష్ట్రాలు...మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, తమిళనాడు, ఉత్తర్‌ప్రదేశ్‌ నుంచే ఉన్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 819 మంది కరోనా వల్ల మృతి చెందగా వారిలో 68 శాతం(562 మంది) ఈ అయిదు రాష్ట్రాలకు చెందిన వారే. ఈ రాష్ట్రాల్లో రికవరీ రేటు 60శాతంగా ఉంది. దేశంలో సగటున ప్రతి పదిలక్షల మందిలో 31,394 మందికి పరీక్షలు నిర్వహించారు. ఈ విషయంలో జాతీయ సగటు కన్నా 22 రాష్ట్రాలు ముందంజలో ఉన్నాయి. ప్రతి పది లక్షల మందిలో... గోవాలో 1,30,091 మందికి, దిల్లీలో 85,923 మందికి, ఆంధ్రప్రదేశ్‌లో 65,078 మందికి, తమిళనాడులో 59,923 మందికి, అసోంలో 44,404 మందికి, కర్ణాటకలో 44,061 మందికి పరీక్షలు నిర్వహించారు.

corona cases
కరోనా విలయం
corona cases
దేశవ్యాప్తంగా కేసుల వివరాలు
corona cases
రాష్ట్రాల వారీగా కరోనా కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.