ETV Bharat / bharat

భారత్​లో అమెరికాను మించి పెరుగుతున్న కరోనా కేసులు - అమెరికా

భారత్​లో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. మిగతా ప్రపంచ దేశాలతో పోల్చుకుంటే.. భారత్​లోనే రోజువారీ కరోనా కేసుల వృద్ధిరేటు చాలా ఎక్కువగా ఉంది. దేశంలో పాజిటివ్‌ కేసుల రేటు తొలిసారి 7శాతం దాటడం గమనార్హం.

Corona cases are rising beyond the US in India
భారతదేశంలో అమెరికాకు మించి పెరుగుతున్న కరోనా కేసులు
author img

By

Published : Jul 9, 2020, 6:55 AM IST

కరోనా మహమ్మారి దేశాన్ని కమ్మేస్తోంది. నానాటికీ మరింతగా కోరలు చాస్తోంది. ప్రపంచంలో అత్యధిక కేసులు నమోదవుతున్న దేశాలకంటే భారత్‌లోనే రోజువారీ వృద్ధిరేటు ఎక్కువగా ఉంది. గత వారం రోజుల్లో అమెరికాలో రోజుకు సగటున 1.8% మేర కేసులు వృద్ధి చెందగా, బ్రెజిల్‌లో 2.7%, రష్యాలో 1%, పెరూలో 1.2% మేర పెరిగాయి. భారత్‌లో మాత్రం గతవారం రోజుకు సగటున 3.5% మేర వృద్ధి నమోదైంది. ప్రస్తుతం దేశంలో ఒక్కో వ్యక్తి ద్వారా సగటున 1.14 మందికి వైరస్‌ సోకుతోంది. నాలుగు వారాల క్రితం ఇది 1.21గా ఉంటూ రెండువారాల క్రితం 1.12కి తగ్గి, మళ్లీ పెరిగింది.

మరోవైపు, దేశంలో గత 24 గంటల్లో 22,752 కొత్త కేసులొచ్చాయి. 16,883 మంది కోలుకున్నారు. 482 మంది మరణించారు. క్రియాశీల కేసులు 5,387 పెరిగాయి. మహారాష్ట్ర, తమిళనాడుల్లో కేసుల సంఖ్య కొంత తగ్గి, దిల్లీలో పెరిగింది. ఉత్తర్‌ప్రదేశ్‌లో గరిష్ఠ స్థాయిలో 1,332 కేసులొచ్చాయి. 24 గంటల్లో వెయ్యికి పైగా కేసులు నమోదైన రాష్ట్రాల సంఖ్య 7కి చేరింది. రెండంకెల్లో మరణాలు సంభవించిన రాష్ట్రాల సంఖ్య 8కి పెరిగింది. కేరళలో ఎన్నడూ లేనంతగా 272 కేసులొచ్చాయి. రోజుకు 250 దాకా కేసులు నమోదయ్యే రాజస్థాన్‌లో ఒకేరోజు 716 వచ్చాయి. గుజరాత్‌లో మంత్రి ఒకరు కరోనా బారిన పడ్డారు.

ప్రతిచోటా ఎన్నడూ లేనంత..

ప్రస్తుత పరిస్థితులను చూస్తే దేశంలో దాదాపుగా ప్రతి రాష్ట్రంలో కేసులు రికార్డు స్థాయికి చేరుకుంటున్నాయి. గతంలో ఎన్నడూ లేనంత తీవ్రత ప్రతిచోటా కనిపిస్తోంది. పాజిటివ్‌ రేటు తొలిసారి 7% దాటింది.

world wide corona toll
కరోనా విలయం
india corona toll
బుధవారం నాటికి దేశంలోని కరోనా కేసులు

ఇదీ చూడండి: ఇండియా గ్లోబల్​ వీక్​-2020లో మోదీ ప్రసంగం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.