ETV Bharat / bharat

సూర్య ప్రతాపం ఈ వేసవిలో మరింత ఎక్కువ! - march weather updates

ఉత్తరాది రాష్ట్రాల్లో మార్చి నెలలో చల్లటి వాతావరణం నెలకొందని భారత వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణాదిలో మాత్రం సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించింది. ఈ వేసవి సాధారణంకన్నా ఎక్కువ వేడిగా ఉంటుందని అంచనా వేసింది.

cooler-march-in-north-india-south-northeast-see-above-normal-temp-imd
మార్చిలో ఈశాన్యం చల్లగా.. దక్షిణాది వెచ్చగా
author img

By

Published : Mar 29, 2020, 9:25 AM IST

ఉత్తరాది రాష్ట్రాలు ఈ ఏడాది మార్చిలో చల్లగా ఉన్నాయని భారత వాతవరణ శాఖ వెల్లడించింది. ఆ ప్రాంతాల్లో వర్షాలు కురవడమే ఇందుకు కారణమని తెలిపింది. దక్షిణాది సహా ఈశాన్యంలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు పేర్కొంది. మధ్యధరా సముద్రంలో తుపానులే ఈ పరిస్థితి కారణమని వివరించింది ఐఎండీ.

మధ్యధరాలో ఉద్భవించే తుపానులు.... కొండ ప్రాంతాల్లో మంచుకు కారణమవుతాయి. వీటి ప్రభావం మరీ ఎక్కువైతే వర్షం కురుస్తుంది.

వేసవిలో భగభగలే...

ఈ ఏడాది వేసవిలో సాధారణంకన్నా ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అంచనా వేసింది ఐఎండీ. ఉత్తర భారతంలోనూ వేడి ఎక్కువగా ఉంటుందని తెలిపింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.