ETV Bharat / bharat

దిల్లీ ప్రభుత్వం కరోనా మరణాలను దాచి పెడుతోందా? - Delhi Ram Manohar Hospital

కరోనా నేపథ్యంలో రోజువారి కేసులు, మరణాల వివరాలను అధికారికంగా ప్రకటిస్తున్నాయి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు. అయితే ఈ విషయంలో దిల్లీ సర్కార్​ శుక్రవారం విడుదల చేసిన లెక్కలపై తీవ్ర సందిగ్ధత నెలకొంది. ప్రభుత్వ హెల్త్​ బులిటెన్​కు, ఆసుపత్రుల లెక్కలు సరితూగకపోవడమే ఇందుకు కారణం.

Controversy over corona health bulletin figures released by Delhi government on Friday
కేసులను బహిర్గతం చేయడంలో ఎందుకీ సందిగ్ధత?
author img

By

Published : May 9, 2020, 9:08 PM IST

Updated : May 9, 2020, 9:20 PM IST

దిల్లీ ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసిన కరోనా హెల్త్​ బులిటెన్‌ లెక్కలపై తీవ్ర సందిగ్ధత నెలకొంది. నాలుగు ఆసుపత్రుల్లో 90 మంది మృతి చెందినట్లు హాస్పిటల్​ వర్గాలు ప్రకటించగా.. దిల్లీ సర్కారు మాత్రం 68 మంది మృతి చెందినట్లు అధికారిక లెక్కల్లో చూపింది.

ప్రముఖ రామ్‌ మనోహర్‌ ఆసుపత్రిలో శుక్రవారం రోజు 52 మంది చనిపోయినట్లు ఆసుపత్రి వర్గాలు తెలుపగా.. అధికారిక లెక్కల ప్రకారం 26 మంది మాత్రమే మరణించినట్లు వెల్లడించింది.

అయితే దిల్లీ సర్కార్​ ఈ వార్తలను తోసిపుచ్చింది. డాక్టర్లు సభ్యులుగా ఉన్న ప్రత్యేక ఆడిట్‌ బృందం రాష్ట్రంలో కరోనా డేటాను పరిశీలిస్తోందని తెలిపింది. ప్రభుత్వానికి రోజువారిగా డేటాను అందిస్తున్నామని.. తప్పుడు డేటాను ఎందుకు విడుదల చేస్తున్నారో అర్థం కావటం లేదని ఆర్​ఎమ్​ఎల్​ మెడికల్‌ సూపరింటెండెంట్​ మీనాక్షి భరద్వాజ్​ అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులు ఇస్తున్న డేటాను దాచడం లేదని ఆరోగ్యశాఖ మంత్రి సత్యేందర్‌ జైన్‌ అన్నారు.

ఇదీ చదవండి: ఆ ఒక్క రాష్ట్రంలోనే లక్ష లాక్​డౌన్​ ఉల్లంఘన కేసులు!

Last Updated : May 9, 2020, 9:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.