రాబోయే ఆర్థిక సంవత్సరాన్ని నిర్మాణ సాంకేతిక సంవత్సరంగా ప్రకటించారు నరేంద్రమోదీ. వేగంగా పెరుగుతున్న నగరీకరణతో ఇళ్లకు డిమాండ్ ఏర్పడింది. పెరిగిన డిమాండ్‌ను అందుకునేందుకు నవీన సాంకేతికత వాడకం ద్వారా వేగవంతమైన ఇళ్ల నిర్మాణాన్ని ప్రోత్సహించే దిశగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రధాని తెలిపారు.
2022నాటికి ప్రతి కుటుంబానికి సొంత ఇంటిని నిర్మించాలనే లక్ష్యంతో ముందుకెళ్లనున్నామని వెల్లడించారు మోదీ. వేగవంతమైన గృహనిర్మాణం కోసం రియల్ ఎస్టేట్ రంగ చట్టాల్ని సవరించటంతో పాటు సాంకేతిక నైపుణ్యాల్ని పెంచుతామన్నారు. భాజపా హయాంలో కోటి 30 లక్షల ఇళ్లను నిర్మించామన్నారు మోదీ.