ETV Bharat / bharat

పరీక్షల వాయిదాకు నేడు​ కాంగ్రెస్ దేశవ్యాప్త నిరసనలు

కాంగ్రెస్​ పార్టీ నేడు దేశవ్యాప్త నిరసనలు చేపట్టనుంది. జేఈఈ, నీట్​ పరీక్షల వాయిదాకు డిమాండ్​ చేయనుంది. రాష్ట్రాల్లోని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల ఎదుట ధర్నా చేయనుంది. అదే సమయంలో కాంగ్రెస్​ నేతలు ఆన్​లైన్​లో ప్రచార కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

author img

By

Published : Aug 28, 2020, 5:58 AM IST

Congress to protest on postponement of JEE, NEET exams
పరీక్షల వాయిదాకు నేడు​ కాంగ్రెస్ దేశవ్యాప్త నిరసనలు

జేఈఈ, నీట్‌ పరీక్షలను వాయిదా వేయాలంటూ కాంగ్రెస్‌ పార్టీ నేడు దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టనుంది. ఉదయం 11 గంటలకు రాష్ట్రాల్లోని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, జిల్లాల్లో.. కాంగ్రెస్‌ రాష్ట్ర శాఖల ఆధ్వర్యంలో నిరసనకు దిగాలని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ ఓ ప్రకటన విడుదల చేశారు. కరోనా కేసులు పెరుగుతున్న వేళ.. జేఈఈ, నీట్‌ పరీక్షలు నిర్వహించాలన్న ప్రభుత్వ నిర్ణయంపై విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో భారీ భయాలు నెలకొన్నట్లు తెలిపారు. ఈ ఆందోళనల సందర్భంగా కరోనా నిబంధనలు పాటించాలని కేసీ వేణుగోపాల్‌ పీసీసీలకు సూచించారు.

మరోవైపు ఈ అంశంపై దేశవ్యాప్తంగా ఆన్‌లైన్‌ ఉద్యమం కూడా చేపట్టాలని కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయించింది. 'స్పీక్‌ అప్‌ ఫర్‌ స్టూడెంట్‌ సేఫ్టీ' అనే హ్యాష్‌ట్యాగ్‌తో కాంగ్రెస్​ నేతలు ప్రచారాలు నిర్వహించనున్నారు. ట్విటర్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రాం వంటి అన్ని సామాజిక మాధ్యమ వేదికల్లో విద్యార్థుల తరఫున తమ గళాన్ని వినిపించనున్నారు.

ఇదీ చూడండి:- 'నీట్​, జేఈఈ రాసేందుకు విద్యార్థులు సుముఖం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.