ETV Bharat / bharat

రాహుల్​ 'జీ-20' - 'జీ-20' దేశాలు

కాంగ్రెస్​ అధ్యక్షుడు రాహుల్​గాంధీ, జీ-20 దేశాల ప్రతినిధులు, రాయబారులతో సమావేశమయ్యారు.

జీ-20 దేశాల ప్రతినిధులు, రాయబారులతో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్​ గాంధీ సమావేశం
author img

By

Published : Mar 6, 2019, 4:24 PM IST

జీ-20 దేశాల ప్రతినిధులు, రాయబారులతో కాంగ్రెస్​ అధ్యక్షుడు రాహుల్​గాంధీ సమావేశమయ్యారు. దిల్లీలోని ఓ ప్రైవేటు హోటెల్​లో అతిథుల కోసం రాహుల్​ మధ్యాహ్న విందు ఏర్పాటుచేశారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ ఛైర్​ పర్సన్​ సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్​, ఇతర సీనియర్​ కాంగ్రెస్​ నాయకులు పాల్గొన్నారు.

గత నెల 15న జీ-20 దేశాల ప్రతినిధులు, రాయబారులతో ఈ సమావేశం జరగాల్సింది. అయితే పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో నేటికి వాయిదా పడింది.

'జీ-20' దేశాలు....

'జీ-20'లో భారత్​, అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్​, కెనడా, చైనా, యూరోపియన్​ యూనియన్, ఫ్రాన్స్​, జర్మనీ, ఇండోనేసియా, ఇటలీ, జపాన్​, మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, దక్షిణ కొరియా, టర్కీ, యునైటెడ్​ కింగ్​డమ్​, అమెరికా సభ్యదేశాలుగా ఉన్నాయి. 'శాశ్వత అతిథి దేశం' హోదాను స్పెయిన్​కు ఇచ్చారు.

ప్రపంచ ఆర్థికవ్యవస్థలోని కీలక సమస్యల పరిష్కారానికి, పారిశ్రామిక, ఆర్థిక అభివృద్ధికి సమష్టి కృషి చేయాలనేది జీ-20 ముఖ్య ఉద్దేశ్యం. సమన్వయ దృక్పథంతో పురోగతి సాధించాలన్నది జీ-20 దేశాల ధ్యేయం.

Intro:Body:

a

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.