మహారాష్ట్రలో కాంగ్రెస్-ఎన్సీపీ సమావేశం ముగిసింది. ఇరు పార్టీల మధ్య సుదీర్ఘ చర్చలు జరిగినట్లు ప్రకటించారు కాంగ్రెస్ నేత పృథ్వీరాజ్ చవాన్. చర్చలు ఇంకా కొనసాగుతాయని.. త్వరలోనే స్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్లు సంకేతాలిచ్చారు.
మహారాష్ట్రలో కచ్చితంగా ప్రత్యామ్నాయ ప్రభుత్వ ఏర్పాటు అవసరముందని వ్యాఖ్యానించారు ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్. కాంగ్రెస్-ఎన్సీపీ-శివసేన ఒక్కటి కాకుంటే ఇది సాధ్యం కాదన్నారు. సమస్యల్ని పరిష్కరించుకొని.. త్వరలోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు మాలిక్.