ETV Bharat / bharat

'స్వల్ప వ్యవధిలో సభలు కుదరవు'.. గహ్లోత్​కు గవర్నర్ లేఖ - తాజా వార్తలు రాజస్థాన్​

Congress MLA
గవర్నర్​తో రాజస్థాన్​ సీఎం గహ్లోత్​ భేటీ
author img

By

Published : Jul 24, 2020, 12:25 PM IST

Updated : Jul 24, 2020, 11:00 PM IST

22:58 July 24

ప్రభుత్వానికి గవర్నర్ కార్యాలయం లేఖ

శాసనసభ సమావేశాల నిర్వహణపై ప్రభుత్వం చేసిన విజ్ఞప్తికి సమాధానమిచ్చింది గవర్నర్ కార్యాలయం. సభలు నిర్వహించాలని అతిస్వల్ప వ్యవధిలో కోరినట్లు వెల్లడించింది. ప్రభుత్వ విజ్ఞప్తిని న్యాయ నిపుణులు పరిశీలించారని.. ఇంత స్వల్ప వ్యవధితో సమావేశాలు నిర్వహించడం సాధ్యం కాదని తెలిపింది. అసెంబ్లీ నిర్వహణకు సాధారణంగా 21 రోజుల ముందు తెలపాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. అందరు ఎమ్మెల్యేలు స్వేచ్ఛగా ఉన్నారనే అంశమై రాష్ట్ర ప్రభుత్వం హామి ఇవ్వాలని కోరింది.  

21:39 July 24

గహ్లోత్​కు గవర్నర్ లేఖ.. 

రాజస్థాన్ గవర్నర్ కల్​రాజ్ మిశ్రా ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్​కు లేఖ రాశారు. అసెంబ్లీ సమావేశం నిర్వహించే అంశమై నిపుణులతో తాను చర్చించాల్సి ఉందని.. అంతలోనే ప్రజలు రాజ్​భవన్​ను ఘోరావ్ చేస్తే తమది బాధ్యత కాదని సీఎం బహిరంగ ప్రకటన చేయడం సరికాదని లేఖలో అభిప్రాయపడ్డారు. మీ నేతృత్వంలోని హోంశాఖ గవర్నర్​నే కాపాడలేకపోతే రాష్ట్రంలో శాంతి, భద్రతల మాటేమిటని ఆందోళన వ్యక్తం చేశారు. రాజ్​భవన్​లో ఎమ్మెల్యేలు ధర్నా చేయడం తప్పుడు సంప్రదాయాన్ని ప్రారంభించడం కాదా అని ప్రశ్నించారు.

21:16 July 24

తిరుగుబాటు ఎమ్మెల్యేలకు నోటీసులు

కాంగ్రెసె రెబల్ ఎమ్మెల్యేలు తన్వీర్ సింగ్, బల్వంత్ సింగ్, దిగ్విజయ సింగ్, కర్ణి సింగ్​లకు రాజస్థాన్ ఎస్ఓజీ బృందం నోటీసులు జారీ చేసింది. ఎమ్మెల్యేలు విశ్వేంద్ర సింగ్, భన్వర్​ లాల్ శర్మకు అవినీతి నిరోధక శాఖ తాకీదులు ఇచ్చింది.

20:05 July 24

  • Rajasthan: Congress MLAs, supporting CM Ashok Gehlot, leave from Raj Bhawan where the had sat in protest and raised slogans over the issue of the convening of Assembly Session.

    Chief Minister had met Governor Kalraj Mishra today & has now called a cabinet meet at 9:30 pm. https://t.co/6dTlMBv8mI pic.twitter.com/mag0K3DDVA

    — ANI (@ANI) July 24, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

రాజ్​భవన్​ను వీడిన నేతలు

ముఖ్యమంత్రి గహ్లోత్ నేతృత్వంలో రాజ్​భవన్​లో ఐదుగంటల పాటు బైఠాయించిన ఎమ్మెల్యేలు.. ధర్నాను విరమించి తిరుగుపయనమయ్యారు. అసెంబ్లీ సమావేశం నిర్వహించేందుకు గవర్నర్ అంగీకరించిన నేపథ్యంలో గవర్నర్ అధికారిక నివాసాన్ని వీడారు.  

20:01 July 24

రాత్రి 9.30కు రాజస్థాన్ కేబినెట్

రాజకీయ సంక్షోభం నేపథ్యంలో ప్రభుత్వ వైఖరిపై నిర్ణయం తీసుకునేందుకు రాత్రి 9.30 గంటలకు సమావేశం కానుంది రాజస్థాన్ కేబినెట్. తమ నిర్ణయాన్ని నేడే గవర్నర్​కు పంపించనున్నట్లు సమాచారం.

18:00 July 24

రాజ్​భవన్​లో రాజకీయం

పైనుంచి ఒత్తిళ్లు ఉన్నందువల్లే గవర్నర్ అసెంబ్లీ నిర్వహణకు అడ్డుతగులుతున్నట్లు పేర్కొన్నారు సీఎం గహ్లోత్. తమ డిమాండ్లను నెరవేర్చేవరకు రాజ్​భవన్ ఆవరణలో ధర్నాకు కూర్చుంటున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజ్​భవన్ ఆవరణలో బైఠాయించారు.

సమావేశాల నిర్వహణపై గురువారమే నిర్ణయం తీసుకోవాల్సి ఉందని పేర్కొన్న గహ్లోత్.. సభల నిర్వహణకు అవసరమైన ఆదేశాలను జారీ చేయాలని మరోసారి గవర్నర్​ను కలిసినట్లు వెల్లడించారు. గవర్నర్ ఒత్తిళ్లకు తలొగ్గబోరని.. సభల నిర్వహణకు అనుమతిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.  

17:33 July 24

  • #WATCH: "Rajasthan CM Ashok Gehlot said we are held hostage by BJP, I want to clarify that it is not so... We are here at our own will as despite our efforts he didn't listen to any of our demands related to work in our constituencies," says MLA Suresh Modi from Sachin Pilot camp pic.twitter.com/Y1ZU2elw5U

'భాజపా ఆతిథ్యం నిజం కాదు'

ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ ఆరోపిస్తున్నట్లుగా తమకు దిల్లీలో భాజపా ఆతిథ్యం ఇవ్వడం లేదని పేర్కొన్నారు పైలట్ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు. వారి సొంత నిర్ణయానికి అనుగుణంగానే క్యాంప్​లో ఉన్నట్లు పేర్కొన్నారు. తమ నియోజకవర్గాల అభివృద్ధికి సంబంధించిన డిమాండ్లను సీఎం నెరవేర్చని కారణంగానే అసమ్మతి బాట పట్టినట్లు వెల్లడించారు.

15:29 July 24

గవర్నర్​తో సీఎం గహ్లోత్ భేటీ

రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ రాష్ట్ర గవర్నర్ కల్​రాజ్ మిశ్రాతో భేటీ అయ్యారు. తన వర్గం ఎమ్మెల్యేలతో కలసి రాజ్​భవన్​కు వెళ్లిన ఆయన అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై మరోసారి గవర్నర్​కు విజ్ఞప్తి చేశారు.

15:28 July 24

రాజస్థాన్ రాజకీయం మరో మలుపు తిరిగింది. శాసనసభ సమావేశాల నిర్వహణకు అనుమతించకూడదని రాష్ట్ర గవర్నర్ కల్​రాజ్ మిశ్రాపై రాజకీయ ఒత్తిళ్లు ఉన్నట్లు ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ వ్యాఖ్యానించారు. సమావేశాల కోసం రాష్ట్రప్రభుత్వం.. గవర్నర్​కు ఇప్పటికే విజ్ఞప్తి చేసినప్పటికీ ఆయన అందుకు సంబంధించిన ఆదేశాలు జారీ చేయడం లేదని వెల్లడించారు.  

"మేం వచ్చే సోమవారం నుంచి శాసనసభ సమావేశాలు నిర్వహించాలనుకుంటున్నాం. గవర్నర్ ఇందుకు సంబంధించిన ఆదేశాలు జారీ చేయడం లేదు. గత రాత్రే శాసనసభ నిర్వహణకు ఆదేశాలు విడుదల అవుతాయని మేం భావించాం. దీనిపై రాత్రంతా వేచిచూసినప్పటికీ గవర్నర్ వద్దనుంచి ఎలాంటి స్పందన రాలేదు."

          -అశోక్ గహ్లోత్, రాజస్థాన్ ముఖ్యమంత్రి

గవర్నర్ రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నారని.. ఆ పోస్టు గౌరవానికి భంగం కలగకుండా సభల నిర్వహణకు వెంటనే చర్యలు తీసుకోవాలని గహ్లోత్ కోరారు. లేదంటే తమ వర్గానికి చెందిన శాసనసభ్యులతో కలిసి గవర్నర్​ను కలిసి విజ్ఞప్తి చేస్తామన్నారు. అప్పటికీ సభల నిర్వహణపై స్పష్టత రాకపోతే.. ప్రజలు రాజ్​భవన్​ను ఘెరావ్ చేసే అవకాశం ఉందని.. దానికి బాధ్యత తమది కాదని చెప్పారు.  

12:57 July 24

  • రాజస్థాన్: గవర్నర్‌ను కలిసిన  సీఎం అశోక్ గహ్లోత్
  • కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కలిసి గవర్నర్‌ను కలిసిన అశోక్ గహ్లోత్
  • అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని భావిస్తున్నాం: సీఎం అశోక్ గహ్లోత్
  • కరోనా, తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించడానికే అసెంబ్లీ సమావేశాలు: అశోక్ గహ్లోత్
  • అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై ఇప్పటికే గవర్నర్‌కు లేఖ రాశాం: సీఎం గహ్లోత్
  • ఒత్తిళ్ల కారణంగానే గవర్నర్ నిర్ణయం తీసుకోవట్లేదని భావిస్తున్నాం: సీఎం గహ్లోత్

12:21 July 24

గవర్నర్​తో రాజస్థాన్​ సీఎం గహ్లోత్​ భేటీ

రాజస్థాన్​ ముఖ్యమంత్రి అశోక్​ గహ్లోత్​ పార్టీ ఎమ్మెల్యేలతో కలసి కాసేపట్లో గవర్నర్​ను కలవనున్నారు.

Last Updated : Jul 24, 2020, 11:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.