ఓటు.. ఓ వ్యక్తిని గద్దె ఎక్కించాలన్నా, దించాలన్నా ఉపయోగపడే ఆయుధం. అందుకే భారత్‌లో ఎక్కడైనా ఓటింగ్‌కు ప్రాముఖ్యం ఎక్కువే. తాజాగా మధ్యప్రదేశ్‌లో 3 రాజ్యసభ సీట్ల కోసం ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఓటు వేసేందుకు కరోనా ఉన్నా ఏకంగా అసెంబ్లీకి వచ్చారు ఓ ఎమ్మెల్యే.
రాష్ట్రంలోని ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యేకు ఇటీవలె కరోనా పాజిటివ్ వచ్చింది. హోమ్ క్వారంటైన్లో ఉన్న ఆయన.. రాజ్యసభకు అభ్యర్థులను ఎన్నుకునేందుకు భోపాల్ అసెంబ్లీ వచ్చారు. పీపీఈ కిట్ ధరించి వచ్చి, ఓటు వేసిన తక్షణమే వెళ్లిపోయారు. వెంటనే అక్కడి సిబ్బంది మొత్తం అసెంబ్లీని శానిటైజ్ చేశారు.