ETV Bharat / bharat

'అసమ్మతి'కి చెక్​ పెడుతూ కాంగ్రెస్​లో సంస్కరణలు! - congress reforms latest news

కాంగ్రెస్​లో సంస్కరణలు మొదలయ్యాయి. ఇందులో భాగంగా లోక్​సభ, రాజ్యసభ కమిటీల్లో మార్పులు చేసింది. అయితే నాయకత్వ మార్పుపై ఇటీవల సోనియాకు లేఖ రాసిన అసమ్మతి నేతలకు మాత్రం మొండిచేయి చూపించింది. ఫలితంగా మనీశ్​ తివారీ, శశి థరూర్​, ఆజాద్​ వంటి సీనియర్లకు సొంత పార్టీలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది.

congress latest news
'అసమ్మతి'కి చెక్​ పెడుతూ కాంగ్రెస్​లో సంస్కరణలు..!
author img

By

Published : Aug 28, 2020, 7:14 PM IST

కాంగ్రెస్‌ సీనియర్‌ నేతల్లో 23 మంది ఇటీవల పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాకు రాసిన సుదీర్ఘ లేఖపై.. అంతర్గతంగా పెద్ద దుమారమే చెలరేగింది. పార్టీలో నాయకత్వ లోపం, నిర్ణయాల లేమి తదితర అంశాలను వారంతా ప్రస్తావించినట్లు సమాచారం. అయితే వారి సూచనలను పరిగణనలోకి తీసుకున్న కాంగ్రెస్​ అధిష్ఠానం.. తాజాగా సంస్కరణలు మొదలుపెట్టింది. లోక్​సభ, రాజ్యసభ కమిటీల్లో అనూహ్యంగా మార్పులు చేసింది. అయితే ఇందులో లేఖ రాసిన 23 మంది అసమ్మతివాదులకు చోటు దక్కకపోవడం గమనార్హం.

ప్రాతినిధ్యం లేనివారికి పదవులా...?

లోక్​సభలో రవ్​నీత్​ సింగ్​ బిట్టూకు విప్​గా బాధ్యతలు అప్పగించింది పార్టీ అధిష్ఠానం. లేఖ రాసిన వారిలో ఉన్న సీనియర్లు మనీశ్​ తివారీ, శశి థరూర్​కు మాత్రం చోటు దక్కలేదు.

రాజ్యసభలో చీఫ్​ విప్​గా జైరాం రమేశ్​ను నియమించారు. అంతేకాదు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చే ఆర్డినెన్స్​లపై మాట్లాడేందుకు ఐదుగురు సభ్యులతో కూడిన కన్వీనర్​ కమిటీని ఏర్పాటు చేసింది కాంగ్రెస్​. ఇందులో మాజీ కేంద్ర మంత్రి కపిల్​ సిబల్​కు చోటివ్వలేదు. గులాం నబీ ఆజాద్​కు బదులుగా రాహుల్ సన్నిహితుడు కేసీ వేణుగోపాల్​కు అవకాశం దక్కింది.

ఈ తాజా నిర్ణయాలపై కాంగ్రెస్​ తీరును ప్రశ్నించారు కాంగ్రెస్ బహిష్కృత నేత సంజయ్​ ఝా.

" కాంగ్రెస్​ నుంచి పార్లమెంటులో తమ గళం వినిపించే వారిలో శశి థరూర్​, మనీశ్​ తివారీ ముందుంటారు. వాళ్లు కేరళ (15 లోక్​సభ స్థానాలు), పంజాబ్​(8 లోక్​సభ స్థానాల)కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దాదాపు లోక్​సభలోని కాంగ్రెస్​కు ఉన్న 44 శాతం ఓటింగ్​కు వారే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 1 సీటు​ ఉన్న బంగాల్, 2 సీట్లు ఉన్న అసోం తరఫు వ్యక్తులకు కీలక పదవులు ఇవ్వడం సమంజసమా..? "

-- సంజయ్​ ఝా, కాంగ్రెస్​ బహిష్కృత నేత

లోక్​సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా అధిర్​ రంజన్​ చౌదరిని.. ఆయనకు డిప్యూటీగా సీనియర్​ నాయకుడు గౌరవ్ గొగోయ్​ను నియమించడాన్ని సంజయ్​ తప్పుపట్టారు.

కీలకమైన పదవులను రాహుల్​ గాంధీ సన్నిహిత వ్యక్తులకు అప్పగించినట్లు విమర్శలు వస్తున్నాయి. ఆయన నిర్ణయంతోనే అసమ్మతివాదులకు ఎదురుదెబ్బ తగిలినట్లు విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అయితే... "ఇది పూర్తిగా సీపీపీ ఛైర్​పర్సన్​ నిర్ణయం. ఆమె ఈ పోస్టుల్లో ఏ కాంగ్రెస్​ ఎంపీని అయినా నియమించవచ్చు" అని లోక్​సభలోని కాంగ్రెస్​ చీఫ్​ విప్ కె. సురేశ్​ స్పష్టం చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.