అయోధ్య రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూవివాదం కేసుపై నేడు ఉదయం 10:30 గంటల సమయంలో తుది తీర్పు వెలువరించనుంది సుప్రీం కోర్టు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఉన్నత స్థాయి నాయకత్వం సీడబ్ల్యూసీ సమావేశం కానుంది. తీర్పు సందర్భంగా పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించే అవకాశం ఉంది.
కాంగ్రెస్ సీడబ్ల్యూసీ సమావేశం ఆదివారం నిర్వహించాలని నిర్ణయించినప్పటికీ.. అయోధ్య కేసు తీర్పు నేపథ్యంలో శనివారం ఉదయమే భేటీ కానున్నట్లు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు. సీడబ్ల్యూసీ సభ్యులు, శాశ్వత, ప్రత్యేక ఆహ్వానితులు ఈ సమావేశానికి హజరవుతారని తెలిపారు.
కాంగ్రెస్ ఉన్నత స్థాయి నిర్ణయాత్మక బృందం సీడబ్ల్యూసీ.. కీలక విషయాలపై పార్టీ వైఖరిని నిర్ణయించనుంది.
ఇదీ చూడండి: భాజపా-శివసేన మధ్య 'మహా' తూటాలు