కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై విమర్శలతో విరుచుకుపడ్డారు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా. కశ్మీర్‌పై ఐక్యరాజ్య సమితికి చేసిన ఫిర్యాదులో రాహుల్‌గాంధీ వ్యాఖ్యలను పాకిస్థాన్ పేర్కొందని.. దీనికి కాంగ్రెస్ నేతలు సిగ్గుపడాలని ధ్వజమెత్తారు. కశ్మీర్‌పై చేస్తున్న వ్యాఖ్యలతో పాకిస్థాన్‌లో రాహుల్ ప్రశంసలు పొందుతున్నారని ఎద్దేవా చేశారు షా.
దాద్రానగర్ హవేలీలోని సిల్‌వాసాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు అమిత్ షా. అనంతరం జరిగిన బహిరంగ సభలో కాంగ్రెస్ నేతలపై మండిపడ్డారు. ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ప్రజలు మద్దతిచ్చారని చెప్పారు. రాహుల్ ప్రకటనలను భారత్‌కు వ్యతిరేకంగా పాక్ ఉపయోగిస్తుందన్నారు. దీనికి కాంగ్రెస్ నేతలు సిగ్గుపడాలని విమర్శించారు షా. ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత జమ్ముకశ్మీర్‌లో హింస తగ్గిందన్నారు. అభివృద్ధికి మార్గం సుగమమైందని తెలిపారు.
కశ్మీర్లో హింస చెలరేగుతోందని, ప్రజలు చనిపోతున్నారని తమకు సమాచారం అందిందని ఇటీవలే వ్యాఖ్యానించారు రాహుల్.
ఇదీ చూడండి: ఆందోళనకరంగా దేశ ఆర్థిక స్థితి: మన్మోహన్