నోరు జారి పొరపాటున పాకిస్థాన్ జాతిపిత మహ్మద్ అలీ జిన్నా పేరును వాడానని కాంగ్రెస్ నేత శతృఘ్న సిన్హా స్పష్టం చేశారు. ఛింద్వాడా బహిరంగ సభలో ప్రసంగిస్తూ... కాంగ్రెస్లో ప్రముఖుల పేర్లను సిన్హా ప్రస్తావించటం వివాదాస్పదమయింది.
"కాంగ్రెస్.. మహాత్మా గాంధీ, సర్దార్ పటేల్, అలీ జిన్నా, నెహ్రూ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీ లాంటి వ్యక్తులున్న పార్టీ. స్వాతంత్రోద్యమం నుంచి దేశాభివృద్ధిలో వారి పాత్ర ఎంతో కీలకం. నేను కాంగ్రెస్లో చేరింది అందుకే. ఇక ఒకసారి వచ్చానంటే పార్టీని వీడటం అంటూ జరగదు."
-శతృఘ్న సిన్హా, కాంగ్రెస్ నేత
విమర్శల వెల్లువ
సిన్హా వ్యాఖ్యలపై ప్రత్యర్థులు విమర్శలు ఎక్కుపెట్టారు. దేశాన్ని విభజించిన వ్యక్తిని కాంగ్రెస్ కీర్తిస్తోందని ఆరోపించారు భాజపా అధ్యక్షుడు అమిత్ షా.
-
Shatrughan Sinha has just gone to the Congress. When he was in BJP he used to talk about nationalism. Now, he says that Jinnah was also a great leader like Mahatma Gandhi and Sardar Patel. Congress leaders are praising Jinnah, who has divided the country. pic.twitter.com/Ju7H2iitLQ
— Chowkidar Amit Shah (@AmitShah) April 27, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Shatrughan Sinha has just gone to the Congress. When he was in BJP he used to talk about nationalism. Now, he says that Jinnah was also a great leader like Mahatma Gandhi and Sardar Patel. Congress leaders are praising Jinnah, who has divided the country. pic.twitter.com/Ju7H2iitLQ
— Chowkidar Amit Shah (@AmitShah) April 27, 2019Shatrughan Sinha has just gone to the Congress. When he was in BJP he used to talk about nationalism. Now, he says that Jinnah was also a great leader like Mahatma Gandhi and Sardar Patel. Congress leaders are praising Jinnah, who has divided the country. pic.twitter.com/Ju7H2iitLQ
— Chowkidar Amit Shah (@AmitShah) April 27, 2019
పొరపాటు మాత్రమే
తనపై వస్తున్న విమర్శలపై స్పందించిన సిన్హా... జిన్నా పేరును పొరపాటుగా పలికానని స్పష్టం చేశారు.
"మౌలానా అబుల్ కలాం ఆజాద్ పేరుకు బదులుగా జిన్నా అని ఉచ్ఛరించాను. ప్రసంగావేశంలో ఉన్నప్పుడు మాట్లాడిన మాటలే అవి. పొరపాటే తప్ప ఉద్దేశపూరితమైనవి కావు. ఇందులో క్షమాపణలు చెప్పడానికి ఏమీ లేదు."
-శతృఘ్న సిన్హా, కాంగ్రెస్ నేత
ఇదీ చూడండి: 4వ దశ ఎన్నికల ప్రచార అంకం సమాప్తం