ఐఎన్ఎక్స్ మీడియా కేసులో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ తిహార్ జైలులో జుడిషీయల్ రిమాండ్‌లో ఉన్న కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి చిదంబరంతో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ సమావేశమయ్యారు.
సెప్టెంబర్ 5 నుంచి తిహార్ జైల్లో రిమాండ్‌లో ఉన్నారు చిదంబరం. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో చిదంబరానికి కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించింది. గత వారం కాంగ్రెస్ నేతలు గులాం నబీ ఆజాద్, అహ్మద్ పటేల్ చిదంబరాన్ని కలిసి సంఘీభావం ప్రకటించారు. నేడు సోనియా, మన్మోహన్ మద్దతు తెలిపారు.
చిదంబరంపై కేంద్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని హస్తం పార్టీ కొన్ని రోజులుగా తీవ్ర ఆరోపణలు గుప్పిస్తోంది.
ఇదీ చూడండి: గాంధీ 150: బాపూను వైఫల్యం పలకరించిన క్షణం!