ETV Bharat / bharat

'ఎంపీల సస్పెన్షన్​.. ప్రతీకార రాజకీయాలకు నిదర్శనం'

ఏడుగురు కాంగ్రెస్ ఎంపీలను బడ్జెట్ సమావేశాల నుంచి సస్పెండ్​ చేయడాన్ని ఆ పార్టీ తీవ్రంగా ఖండించింది. ఇది నియంతృత్వ నిర్ణయమని ఆరోపించింది. దిల్లీ అల్లర్ల అంశాన్ని పార్లమెంటులో లేవనెత్తే విషయమై వెనక్కి తగ్గబోమని తేల్చిచెప్పింది. మరోవైపు కాంగ్రెస్​ ఎంపీలపై సస్పెన్షన్​ వేటును భాజపా స్వాగతించింది. సభలో అమర్యాదగా ప్రవర్తించిన వారిపై స్పీకర్ సరైన నిర్ణయమే తీసుకున్నారని పేర్కొంది.

congress latest news
ఎంపీల సస్పెన్షన్​ వేటును స్వాగతించిన భాజపా.. కాంగ్రెస్​ ఖండన
author img

By

Published : Mar 5, 2020, 5:36 PM IST

Updated : Mar 5, 2020, 8:22 PM IST

'ఎంపీల సస్పెన్షన్​.. ప్రతీకార రాజకీయాలకు నిదర్శనం'

సభను అగౌరవపరిచారని ఏడుగురు కాంగ్రెస్​ ఎంపీలను పార్లమెంటు బడ్జెట్ సమావేశాల నుంచి సస్పెండ్ చేయడాన్ని ఆ పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది. స్పీకర్​ది నియంతృత్వ నిర్ణయమని ఆరోపించింది. దిల్లీ అల్లర్ల అంశాన్ని సభలో లేవనెత్తకుండా అణచివేయడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నారని కాంగ్రెస్ లోక్​సభా పక్షనేత అధిర్​ రంజన్​ చౌదరి విమర్శించారు. ఇది స్పీకర్ నిర్ణయం కాదని, భాజపా ప్రభుత్వ నిర్ణయమని ఆరోపించారు. ప్రతీకార రాజకీయాలకు ఈ చర్య నిదర్శనమన్నారు. దిల్లీ అల్లర్ల అంశంపై పార్లమెంటులో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని స్ఫష్టం చేశారు అధిర్. ఎంపీలపై సస్పెన్షన్​ వేటు సరైనదో కాదో ప్రజలే నిర్ణయిస్తారని చెప్పారు.

తమను ఏడాది పాటు లోక్​సభలో అడుగుపెట్టనివ్వకుండా చేసినా .. పార్లమెంటులో మాత్రం దిల్లీ అల్లర్లపై చర్చ జరగాల్సిందేనని సస్పెన్షన్​కు గురైన కాంగ్రెస్ ఎంపీ గౌరవ్​ గొగొయ్ వెల్లడించారు.

భాజపా మాట..

మరోవైపు ఏడుగురు కాంగ్రెస్ సభ్యులపై స్పీకర్​ వేటును భాజపా స్వాగతించింది. వెల్​ నుంచి పేపర్లు లాక్కుని చింపివేసి.. సభను అగౌరవపరిచారని పార్లమెంటరీ వ్యహహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్​ జోషి ఆరోపించారు. సభలో కాంగ్రెస్ సభ్యుల ప్రవర్తనను తప్పుబట్టారు. తరచూ అమర్యాదగా ప్రవర్తిస్తున్న సభ్యులపై దృష్టి సారించేందుకు ప్యానెల్​ ఏర్పాటు చేయాలని స్పీకర్​ ఓంబిర్లాను కోరినట్లు తెలిపారు.

ఇదీ చూడండి: ఏడుగురు కాంగ్రెస్​ ఎంపీలపై సస్పెన్షన్​ వేటు

Last Updated : Mar 5, 2020, 8:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.