భాజపా ప్రభుత్వం తెచ్చిన వస్తు సేవల పన్ను(జీఎస్టీ), నోట్ల రద్దు వల్ల దేశ ఆర్థిక వ్యవస్థకు తీవ్ర నష్టం కలిగిందని, కోట్లాది ఉద్యోగాలు నాశనమయ్యాయని ఆరోపించారు రాహుల్ గాంధీ. తమ పార్టీ అధికారంలోకి వస్తే ఒకే పన్ను స్లాబు ఉండే సరళతర జీఎస్టీని తీసుకొస్తామని స్పష్టం చేశారు.
'జీఎస్టీ 2.ఓ'పై వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు రాహుల్ గాంధీ. ప్రస్తుతం అమలవుతున్న వస్తు సేవల పన్ను(జీఎస్టీ) వల్ల చిన్న వ్యాపారులు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఆ వీడియోలో పొందుపరిచారు. అలాగే కాంగ్రెస్ జీఎస్టీని ఎలా సరళతరం చేస్తుందో వివరించారు.
జీఎస్టీని గబ్బర్‌సింగ్ ట్యాక్స్‌గా అభివర్ణించారు రాహుల్.
-
Gabbar Singh Tax and Demonetisation destroyed crores of jobs causing tremendous pain and badly damaging our economy. The Congress Party is committed to GST 2.0 - a single GST, with simple reporting.
— Rahul Gandhi (@RahulGandhi) April 25, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
Here's a short video setting down the Congress Party's vision for GST 2.0. pic.twitter.com/Q0uZwMUMTa
">Gabbar Singh Tax and Demonetisation destroyed crores of jobs causing tremendous pain and badly damaging our economy. The Congress Party is committed to GST 2.0 - a single GST, with simple reporting.
— Rahul Gandhi (@RahulGandhi) April 25, 2019
Here's a short video setting down the Congress Party's vision for GST 2.0. pic.twitter.com/Q0uZwMUMTaGabbar Singh Tax and Demonetisation destroyed crores of jobs causing tremendous pain and badly damaging our economy. The Congress Party is committed to GST 2.0 - a single GST, with simple reporting.
— Rahul Gandhi (@RahulGandhi) April 25, 2019
Here's a short video setting down the Congress Party's vision for GST 2.0. pic.twitter.com/Q0uZwMUMTa
" గబ్బర్‌సింగ్ ట్యాక్స్, నోట్ల రద్దు కోట్లాది ఉద్యోగాలను నాశనం చేశాయి. దేశ ఆర్థిక వ్యవస్థకు తీవ్ర నష్టం కలిగించాయి. ఒకే పన్ను ఉండే సరళతర జీఎస్టీ 2.ఓను తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది." -- రాహుల్ గాంధీ ట్వీట్
వీడియోలో షోలే పాత్రల ప్రస్తావన
రాహుల్ గాంధీ ట్వీట్ చేసిన వీడియోలో షోలే చిత్రంలోని పాత్రల ప్రస్తావన ఉంది. జీఎస్టీని గబ్బర్ సింగ్ ట్యాక్స్‌గా పోల్చారు. గబ్బర్ పాత్రను ఆ సినిమాలో అంజాద్ ఖాన్ పోషించారు. విలనిజానికి ఆ పాత్ర ఎంతో ప్రాచుర్యం పొందింది. ప్రస్తుత కఠినతర జీఎస్టీ తొలగించి... కాంగ్రెస్ ఏ విధంగా సరళం చేస్తుందనేదే ఆ వీడియో సారాంశం.