కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, భోపాల్ లోక్సభ నియోజకవర్గ అభ్యర్థి దిగ్విజయ్ సింగ్కు ఎన్నికల ప్రచారంలో ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది. ఆయన సమక్షంలోనే మోదీపై ప్రశంసల జల్లు కురిపించాడో యువకుడు.
2014 ఎన్నికల సమయంలో చెప్పినట్లు మోదీ రూ.15 లక్షలు మీ ఖాతాలో వేశారా అని ప్రశ్నించారు దిగ్విజయ్. సభకు హాజరైన వారిలో ఓ యువకుడు లేచి నిల్చున్నాడు. నీ ఖాతాలో డబ్బు వేశారా... అయితే ఖాతా నంబర్ చెప్పు అని అడిగారు. వేదికపైకి పిలిచారు.
యువకుడు వేదికపైకి వచ్చి భాజపాపై విమర్శలు చేస్తాడని అంతా భావించారు. అనూహ్యంగా అతడు "మోదీ మెరుపుదాడులు చేశారు, ఉగ్రవాదులను చంపారు" అని పొగిడాడు.
ఈ వ్యాఖ్యలతో దిగ్విజయ్ సహా కాంగ్రెస్ నేతలు ఖంగుతిన్నారు. వెంటనే తేరుకుని ఆ యువకుడ్ని వేదికపై నుంచి దించేశారు.
ఇదీ చూడండీ: 'మోదీ... దమ్ముంటే అవినీతిపై చర్చకు రండి'