కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ రాజీనామా చేయాలంటూ కాంగ్రెస్ పార్టీ ధర్నా నిర్వహించింది. బంగారం అక్రమ రవాణా కేసులో బాధ్యత వహిస్తూ పదవి నుంచి వైదొలగాలని డిమాండ్ చేసింది. కొల్లాం జిల్లా చిన్నకడ వద్ద జాతీయ రహదారిని దిగ్బంధించింది.
డీసీసీ అధ్యక్షుడు బిందు కృష్ణ నేతృత్వంలోని 50 మంది కాంగ్రెస్ కార్యకర్తలు జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. సీఎం విజయన్, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి కొడియేరి బాలకృష్ణన్ దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు. నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కోజికోడ్‌లో భాజపా..
-
#WATCH Kerala: Police use water cannon against BJP Yuva Morcha workers, trying to remove barricades outside Police Commissioner Office in Kozhikode.
— ANI (@ANI) October 30, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
Protesters are demanding Kerala CM's resignation over involvement of ex-principal Secy M Sivashankar in #KeralaGoldSmugglingCase pic.twitter.com/BMwTovBNyb
">#WATCH Kerala: Police use water cannon against BJP Yuva Morcha workers, trying to remove barricades outside Police Commissioner Office in Kozhikode.
— ANI (@ANI) October 30, 2020
Protesters are demanding Kerala CM's resignation over involvement of ex-principal Secy M Sivashankar in #KeralaGoldSmugglingCase pic.twitter.com/BMwTovBNyb#WATCH Kerala: Police use water cannon against BJP Yuva Morcha workers, trying to remove barricades outside Police Commissioner Office in Kozhikode.
— ANI (@ANI) October 30, 2020
Protesters are demanding Kerala CM's resignation over involvement of ex-principal Secy M Sivashankar in #KeralaGoldSmugglingCase pic.twitter.com/BMwTovBNyb
కోజికోడ్ పోలీస్ కమిషనర్ కార్యాలయం ఎదుట భాజపా యువమోర్చా కార్యకర్తలు నిరసనలు చేపట్టారు. స్మగ్లింగ్ కేసులో మాజీ ప్రధాన కార్యదర్శి ఎం శివశంకర్ హస్తం ఉందన్న ఆరోపణల నేపథ్యంలో సీఎం రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బారికేడ్లు తొలగించేందుకు ప్రయత్నించగా.. భద్రతా సిబ్బంది జలఫిరంగులు ఉపయోగించి వారిని చెదరగొట్టారు.
ఇదీ చూడండి: ఈడీ కస్టడీలో సీఎంఓ మాజీ ముఖ్య కార్యదర్శి