ETV Bharat / bharat

'మోదీ హయాంలో రూ.12వేల కోట్ల ఇనుప కుంభకోణం'

2014లో భాజపా ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి దాదాపు రూ.12,000 కోట్ల ఇనుము ఎగుమతి కుంభకోణానికి పాల్పడిందని ఆరోపించింది కాంగ్రెస్. మేక్ ఇన్ ఇండియా గురించి మాట్లాడే ప్రధాని మోదీ.. దేశాన్ని విదేశాలకు అమ్మేస్తున్నారని మండిపడింది. ఇనుము అక్రమ ఎగుమతులపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసింది.

congress-accuses-govt-of-rs-12000-cr-scam-in-iron-ore-export
'మోదీ హయాంలో రూ.12,000 కోట్లు ఇనుప కుంభకోణం'
author img

By

Published : Oct 8, 2020, 7:32 PM IST

దేశంలో ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో దాదాపు రూ. 12,000 కోట్ల ఇనుప కుంభకోణం జరిగిందని ఆరోపించింది కాంగ్రెస్. కేవలం కుద్రేముఖ్ ఐరన్ ఓర్​ కంపెనీ(కేఐఓసీఎల్)కి మాత్రమే ఇనుము ధాతువును ఎగుమతి చేసే అనుమతులిచ్చిన కేంద్రం.. ప్రైవేటు సంస్థలతో కుమ్మక్కై అక్రమంగా ఇనుమును విదేశాలకు రవాణా చేసిందని విమర్శించింది.

దిల్లీలో ప్రెస్ కాన్ఫెరెన్స్​లో మాట్లాడిన కాంగ్రెస్ అధికార ప్రతినిధి పవన్ ఖేరా.. మోదీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రధాని ఓవైపు.. మేక్ ఇన్ ఇండియా గురించి మాట్లాడుతూనే.. మరోవైపు దేశాన్ని విదేశాలకు అమ్మేస్తున్నారని ఆరోపించారు. 2014 నుంచి అనేక ప్రైవేటు సంస్థలు ఇనుమును ఎగుమతి చేసి, సుంకం నుంచి తప్పించుకుని, లాభాలను ఆర్జించాయని పేర్కొన్నారు.

'మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, దేశీయ ఇనుప ఖనిజాల్లోని 64 శాతాన్ని ఎగుమతి చేసేందుకు కేవలం కేఐఓసీఎల్ సంస్థకు మాత్రమే అనుమతి ఇచ్చింది ఉక్కు మంత్రిత్వ శాఖ. అయితే అనుమతి లేని అనేక ప్రైవేటు సంస్థలు ఇనుమును అక్రమంగా ఎగుమతి చేస్తున్నా.. ఏ ఒక్క సంస్థను ఉక్కు మంత్రిత్వ శాఖ ప్రశ్నించలేదు. అందుకే 2014 నుంచి ఇప్పటివరకు జరిగిన ఇనుప కుంభకోణాన్ని బయటపెట్టేందుకు దర్యాప్తు ప్రారంభించాలి. మంత్రిత్వ శాఖలోని అధికారుల అవినీతిని బయటపెట్టాలి."

-పవన్ ఖేరా, కాంగ్రెస్ అధికార ప్రతినిధి

అనుమతులు లేకపోయినా కొన్ని ప్రవేటు సంస్థలు దాదాపు రూ.40 వేల కోట్లు విలువ చేసే ఇనుమును ఎగుమతి చేశాయని పేర్కొన్నారు ఖేరా. ఈ కుంభకోణంలో భాగస్వాములైన ప్రైవేటు సంస్థల జాబితాను ప్రధాని మోదీ వెల్లడించాలని డిమాండ్ చేశారు. విదేశీ వాణిజ్య అభివృద్ధి-నియంత్రణ చట్టం,1992 ప్రకారం, ఈ అక్రమానికి పాల్పడిన సంస్థలపై రూ .2,00,000 కోట్ల జరిమానా విధించాలని చెప్పారు.

ఇదీ చదవండి: 'ప్రధాని చెప్పినట్టు చేస్తే కరోనాపై విజయం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.