ETV Bharat / bharat

చైనా యాప్​ల నిషేధాన్ని స్వాగతించిన కాంగ్రెస్​

కేంద్ర ప్రభుత్వం చైనా యాప్​లను నిషేధించడాన్ని కాంగ్రెస్ స్వాగతించింది. ఇటువంటి ముఖ్యమైన, సమర్థవంతమైన నిర్ణయాలు మరిన్ని తీసుకోవాలని కేంద్రానికి సూచించింది. దేశ రక్షణకు, భద్రతకు ముప్పుగా పరిణమించిన చైనాకు చెందిన 59 యాప్​లను నిషేధిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది.

author img

By

Published : Jun 30, 2020, 5:54 AM IST

Cong welcomes ban on Chinese apps, seeks more 'effective' measures
చైనా యాప్​ల నిషేధాన్ని స్వాగతించిన కాంగ్రెస్​

సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో చైనా యాప్‌లను నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్​ స్వాగతించింది. మోదీ సర్కార్​ మరిన్ని సమర్థవంతమైన, కీలక నిర్ణయాలు తీసుకోవాలని పేర్కొంది.

చైనా యాప్​ల నిషేధం వల్ల చైనా సాంకేతిక కంపెనీలకు తీవ్ర నష్టం కలుగుతుందన్నారు కాంగ్రెస్​ సీనియర్ నేత అహ్మద్ పటేల్.

"చైనా యాప్స్​ నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మేము స్వాగతిస్తన్నాం. చైనా... భారత భూభాగంలోకి చొరబడి, సాయుధ దళాలపై అప్రజాస్వామిక దాడి చేసిన దృష్ట్యా, మోదీ సర్కార్​ మరిన్ని సమర్థవంతమైన చర్యలను తీసుకుంటుందని ఆశిస్తున్నాము."

-అహ్మద్​ పటేల్​, కాంగ్రెస్​ సీనియర్​ నాయకుడు

పీఎం కేర్స్ విరాళాల సంగతేంటి?

'చైనా యాప్​లను నిషేధించడం మంచి ఉపాయమే. మరి చైనాకు చెందిన టెలికాం సంస్థలు, ఇతర కంపెనీల నుంచి పీఎం కేర్స్​కు వచ్చిన విరళాల సంగతేంటి? మరి వాటిని స్వీకరించడం మంచిదేనా?' అని మరో కాంగ్రెస్​ నేత మనీష్​​ తివారీ పేర్కొన్నారు.

చైనాకు చెందిన టిక్‌టాక్‌, యూసీ బ్రౌజర్‌ సహా 59 యాప్​లను నిషేధిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఈ యాప్స్​ ద్వారా భారత సార్వభౌమాధికారం, సమగ్రత, భద్రతలకు భంగం కలిగే అవకాశముందని విశ్వసనీయ సమాచారంతో ఈ నిర్ణయం తీసుకుంది.

ఇదీ చూడండి: అన్​లాక్​-2 మార్గదర్శకాలను విడుదల చేసిన కేంద్రం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.