ETV Bharat / bharat

లక్షిత దాడులపై కాంగ్రెస్ 'మీటూ... మీటూ': మోదీ - sikar

రాజస్థాన్​ సీకర్​ పట్టణంలో జరిగిన బహిరంగ సభలో ప్రధాని కాంగ్రెస్​పై నిప్పులు చెరిగారు. నియంత్రణ రేఖ వెంబడి తామూ లక్షితదాడులు చేశామని కాంగ్రెస్ అబద్ధాలు చెబుతోందన్నారు ప్రధాని నరేంద్రమోదీ. ఎన్నికల్లో గెలిచేందుకు ఎన్ని తప్పుడు ప్రచారాలకైనా కాంగ్రెస్​ వెనకాడదని విమర్శించారు.

నరేంద్రమోదీ, ప్రధానమంత్రి
author img

By

Published : May 3, 2019, 8:22 PM IST

Updated : May 3, 2019, 8:29 PM IST

కాంగ్రెస్​పై మోదీ ధ్వజం

తమ పాలనలోనూ మెరుపు దాడులు చేశామన్న కాంగ్రెస్ ప్రకటనపై ప్రధాని నరేంద్రమోదీ మండిపడ్డారు. లక్షిత దాడులపై రోజుకో అబద్ధంతో కాంగ్రెస్ ప్రజల ముందుకు వస్తోందని విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజస్థాన్​లోని సీకర్​ బహిరంగ సభలో పాల్గొన్నారు మోదీ.

"ఎన్నికల్లో నాలుగు దశల అనంతరం నాలుగు దిక్కుల్లో ఓడిపోతారన్న భయంతో కొత్త నాటకానికి తెరతీసింది కాంగ్రెస్. ఆ పార్టీలోని ఓ గొప్ప నేత ఓ మాట చెప్పారు. వాళ్ల పాలనలోనూ చాలా సార్లు మెరుపుదాడులు చేశామన్నారు. మొదట మేము మెరుపుదాడులు చేసినప్పుడు అలా జరగటం సాధ్యంకాదన్నారు. అనంతరం ఇదంతా సైనికులకు సాధారణ విషయమేనని కొట్టిపారేశారు. వారు మొదట ఉపేక్షించారు.. తర్వాత విభేదించారు. ఇప్పుడు మేమూ చేశామని 'మీటూ మీటూ' అంటూ హడావుడి చేస్తున్నారు. నాలుగు నెలల ముందు మరో కాంగ్రెస్​ నేత 3సార్లు మెరుపుదాడులు చేశామన్నారు. ఇప్పుడు ఆ సంఖ్య 6కు చేరింది. ఎన్నికలు ముగిసే వరకు ప్రతిరోజూ మెరుపుదాడులు చేశామని చెప్పుకునేలా ఉన్నారు."

-నరేంద్రమోదీ, ప్రధానమంత్రి

యూపీఏ హయాంలో ఆరుసార్లు మెరుపుదాడులు చేశామని గురువారం కాంగ్రెస్ అధికార ప్రతినిధి రాజీవ్​ శుక్లా ప్రకటించారు. ఎన్నికల్లో ఓడిపోతారన్న అనుమానంతోనే మెరుపుదాడులపై వింతవాదనలు చేస్తున్నారని మోదీ ఆరోపించారు.

ఇదీ చూడండి: వణికిస్తోన్న ఫొని- ఒడిశా, బంగాల్​లో హై అలర్ట్​

Intro:Body:Conclusion:
Last Updated : May 3, 2019, 8:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.