ఉత్తరప్రదేశ్‌లోని 'గాంధీల కంచుకోట' అమేఠీలో.. పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఓటమిపాలవడంపై కాంగ్రెస్ సమీక్ష నిర్వహిస్తోంది. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ రాజకీయ వ్యవహారాలు పర్యవేక్షించే జుబిర్ఖాన్, యూపీఏ ఛైర్పర్సన్ సోనియా గాంధీ అధికార ప్రతినిధి కిషోర్లాల్ శర్మ... ఈ పనిలో నిమగ్నమయ్యారు. గత మూడు రోజులుగా జరుగుతున్న ఈ సమీక్షలో రాహుల్‌గాంధీ ఓటమికి గల కారణాలపై విశ్లేషణ చేసుకున్నారు.
"సమీక్ష గ్రామస్థాయిలో కూడా జరుగుతోంది. సమీక్ష బృంద సభ్యులు... మండలం, పంచాయతీ స్థాయి నేతలతోనూ సమావేశాలు నిర్వహిస్తారు."
- రాజీవ్ సింగ్, యూపీ కాంగ్రెస్ కమిటీ సభ్యుడు
చరిత్ర సృష్టించిన స్మృతి..
కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీపై 55,120 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. రాహుల్ ఓటమికి బాధ్యత వహిస్తూ, అమేఠీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు యోగీంద్ర మిశ్రా రాజీనామా చేశారు.
ఇదీ చూడండి: 'దేశ భద్రత, ప్రజా సంక్షేమానికే తొలి ప్రాధాన్యం'