ETV Bharat / bharat

వ్యవసాయ చట్టాలకు చెక్​ పెట్టనున్న కాంగ్రెస్​! - కాంగ్రెస్ పార్టీ న్యూస్

వ్యవసాయ చట్టాలు చెల్లుబాటు కాకుండా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో నూతన చట్టాలు చేయాలని ఆ పార్టీ భావిస్తోంది. దీని కోసం నమూనా చట్టం ముసాయిదాను సిద్దం చేసింది. కేంద్ర చట్టాలకు వ్యతిరేకంగా రాష్ట్రాలు చట్టాలు చేసేందుకు రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 254(2)ను ప్రయోగిస్తోంది కాంగ్రెస్‌.

Cong-prepares-draft-model-law-to-annul-central-farm-laws
వ్యవసాయ చట్టాలకు చెక్​ పెట్టనున్న కాంగ్రెస్​!
author img

By

Published : Oct 3, 2020, 4:41 AM IST

కేంద్రం నూతనంగా తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలు చెల్లుబాటు కాకుండా రాష్ట్రాల్లో నూతన చట్టాలు చేయాలని కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయించింది. దీనికి సంబంధించి నమూనా చట్టం ముసాయిదాను ఆ పార్టీ సిద్ధం చేసింది. దీన్ని త్వరలోనే కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న రాష్ట్రాలకు పంపి అసెంబ్లీల్లో చట్టాలు చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

ఇటీవల మూడు వ్యవసాయ సంబంధిత బిల్లులు ఆమోదం పొందిన నేపథ్యంలో కేంద్ర చట్టానికి పోటీగా రాష్ట్రాలు చట్టాలు చేయాలని కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాలకు ఇప్పటికే పిలుపునిచ్చారు. మరోవైపు పంజాబ్‌, హరియాణా రాష్ట్రాల్లో ఆ పార్టీ ఆదివారం నుంచి ట్రాక్టర్‌ ర్యాలీలు నిర్వహించ తలపెట్టింది. ఈ కార్యక్రమంలో పార్టీ నేత రాహుల్‌ పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ ముసాయిదాను రూపొందించడం గమనార్హం. కేవలం కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాలే కాక.. ఎన్డీయేతర పార్టీలు పాలిస్తున్న రాష్ట్రాలు సైతం ఈ ఆర్టికల్‌ను ఉపయోగించి అసెంబ్లీల్లో చట్టాలు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

కేంద్ర చట్టాలకు వ్యతిరేకంగా రాష్ట్రాలు చట్టాలు చేసేందుకు కాంగ్రెస్‌ పార్టీ రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 254(2)ను ప్రయోగిస్తోంది. ఉమ్మడి జాబితాలోని అంశాల విషయంలో కేంద్ర చట్టాలు చెల్లుబాటు కాకుండా రాష్ట్రాలు తమ పరిధిలో చట్టాలు చేసుకునేందుకు ఈ ఆర్టికల్‌ వీలు కల్పిస్తోంది. గతంలో భూసేకరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ భాజపా సైతం ఇదే ఆర్టికల్‌ను అప్పట్లో ప్రయోగించింది. అయితే, రాష్ట్రాలు చేసిన చట్టాలకు రాష్ట్రపతి ఆమోదం తప్పనిసరి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.