సీనియర్ల లేఖపై దుమారంతో వాడీవేడీగా సాగిన సీడబ్ల్యూసీ భేటీ ముగిసింది. వచ్చే ఆర్నెల్ల లోపు పార్టీకి కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలని తీర్మానించినట్లు తెలుస్తోంది. అప్పటివరకు పార్టీ బాధ్యత సోనియా గాంధీనే చేపట్టాలని నిర్ణయించినట్లు సమాచారం.
పార్టీ సారథ్య బాధ్యతలపై సీడబ్ల్యూసీ భేటీలో సుదీర్ఘ సమయం చర్చించారు నేతలు. తాత్కాలిక అధ్యక్షురాలిగా మరికొంత కాలం సోనియానే కొనసాగాలని మన్మోహన్ సింగ్, ఆంటోని తదితర సీనియర్ నేతలు ప్రతిపాదించారు.