ETV Bharat / bharat

రాజీ కుదిరేనా.. నేడు మరోసారి రాజస్థాన్ సీఎల్పీ భేటీ - Editorial

రాజస్థాన్‌లో ప్రభుత్వం కూలిపోయే ప్రమాదం ఏర్పడిన నేపథ్యంలో అధికార కాంగ్రెస్ పార్టీ బుజ్జగింపుల పర్వాన్ని చర్యలు ప్రారంభించింది. ఈ మేరకు పార్టీపై ధిక్కార స్వరం వినిపిస్తున్న ఉపముఖ్యమంత్రి సచిన్‌ పైలట్‌, ఆయన వర్గాన్ని బుజ్జగించేందుకు మరోసారి సీఎల్పీ సమావేశాన్ని మంగళవారం నిర్వహించనుంది. సోమవారం జరిగిన పార్టీ శాసనసభాపక్ష సమావేశానికి పైలట్‌ వర్గం ఎమ్మెల్యేలు గైర్హాజరు అయ్యారు. ఈ నేపథ్యంలో అందరి సమస్యలు వినేందుకు సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ సిద్ధంగా ఉన్నారని కాంగ్రెస్‌ తెలిపింది.

rajasthan
రాజీ కుదిరేనా.. నేడు మరోసారి రాజస్థాన్ సీఎల్పీ భేటీ
author img

By

Published : Jul 14, 2020, 5:14 AM IST

రాజస్థాన్‌లో కాంగ్రెస్‌పై తిరుగుబాటు బావుటా ఎగరవేసిన ఉపముఖ్యమంత్రి సచిన్‌ పైలట్‌, ఆయన వర్గీయులను తమ దారికి తెచ్చుకునేందుకు కాంగ్రెస్‌ పార్టీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ మేరకు మంగళవారం మరోసారి శాసనసభాపక్ష సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ సహా పలువురు సీనియర్‌ నాయకులు సచిన్‌ పైలట్‌తో మాట్లాడుతున్నట్లు సమాచారం.

సుర్జేవాలా మధ్యవర్తిత్వం

ఏఐసీసీ అధికార ప్రతినిధి రణ్‌దీప్‌ సుర్జేవాలా మంగళవారం మరో సమావేశాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశానికి సచిన్‌ పైలట్‌, ఆయన వెంట ఉన్న ఎమ్మెల్యేలను రావాలని కోరినట్లు తెలిపారు. వారిని లిఖితపూర్వకంగా ఆహ్వానించనున్నట్లు చెప్పారు. సమావేశానికి హాజరై... రాజస్థాన్‌ అభివృద్ధికి కలిసి పని చేసే అంశంపై చర్చించాలని కోరుతున్నట్లు తెలిపారు. సమస్యలన్నీ సద్దుమణుగుతాయని సూర్జేవాలా ఆశాభావం వ్యక్తంచేశారు.

సీఎల్పీకి పైలట్ వర్గం గైర్హాజరు..

సోమవారం నిర్వహించిన శాసనసభాపక్ష భేటీకి హాజరవ్వాలని 107 మంది సభ్యులకు కాంగ్రెస్‌ విప్‌ జారీ చేశారు. అయితే పైలట్‌ సహా 18 మంది ఎమ్మెల్యేలు ఈ సమావేశానికి వెళ్లలేదు. ఈ నేపథ్యంలో సీఎల్పీ భేటీలో 106 మంది ఎమ్మెల్యేలు హాజరైనట్లు కాంగ్రెస్‌ ప్రకటించగా పైలట్‌ వర్గం ఖండించింది.

శాసన సభాపక్ష భేటీలో ప్రభుత్వాన్ని, పార్టీని బలహీనపర్చేందుకు ఎవరు ప్రయత్నించినా వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని తీర్మానం చేశారు. అయితే ఈ తీర్మానంలో సచిన్‌ పైలట్‌ పేరును మాత్రం ప్రస్తావించలేదు. పైలట్‌ తిరుగుబాటు నేపథ్యంలో రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ సహా అహ్మద్‌ పటేల్‌, చిదంబరం, కేసీ వేణుగోపాల్‌ ఆయనతో చర్చలు చేసినట్లు కాంగ్రెస్‌ వర్గాలు తెలిపాయి.

'అసెంబ్లీలో ఓటింగ్​ చేపట్టాలి'

ఉపముఖ్యమంత్రి సచిన్​ పైలట్​కు ఉన్న సంఖ్యా బలాన్ని బయటపెట్టే లక్ష్యంతో సీఎల్పీలో చర్చ జరిగిందని తెలుస్తోంది. అసెంబ్లీలో బలనిరూపణకు ఏర్పాట్లు చేయడంపై పలువురు సభ్యులు అభిప్రాయపడినట్లు సమాచారం. బలనిరూపణ ద్వారా పైలట్ సామర్థ్యం బయటపడుతుందని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది.

కేబినెట్‌ విస్తరణ?

అశోక్‌ గహ్లోత్‌పై అసంతృప్తితో ఉన్న సచిన్‌ పైలట్‌ను సంతృప్తి పరిచేందుకు కేబినెట్‌ విస్తరణ చేపట్టాలని ఓ వైపు కాంగ్రెస్‌ అధిష్ఠానం భావిస్తోంది. ప్రస్తుతం అశోక్‌ గహ్లోత్‌ వర్గానికి చెందిన వారే మంత్రివర్గంలో ఎక్కువ మంది ఉండగా.. కేబినెట్‌ను పునర్‌ వ్యవస్థీకరించి పైలట్‌ వర్గానికి చోటు కల్పించాలని కాంగ్రెస్‌ అధిష్ఠానం భావిస్తున్నట్లు జాతీయ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.

జోరుగా రిసార్టు రాజకీయం..

సోమవారం సీఎల్పీ భేటీ ముగిసిన వెంటనే రిసార్టు రాజకీయాలు ఊపందుకున్నాయి. కాంగ్రెస్‌ పార్టీ తమ శాసనసభ్యులను జయపుర శివార్లలోని హోటల్‌ ఫెయిర్‌మాంట్‌కు తరలించింది. మానేసర్​లోని ఓ రిసార్టులో పైలట్ మద్దతుదారులను ఉంచారని సమాచారం. అధికారిక వాట్సాప్‌ గ్రూప్‌లో సచిన్‌ పైలట్‌ వర్గానికి చెందిన 16 మంది ఎమ్మెల్యేలు ఒకేచోట కూర్చొని ఉన్న వీడియోను పోస్టు చేశారు. ఈ వీడియోలో సచిన్‌ పైలట్‌ కనిపించలేదు. స్పష్టంగా కనిపించనప్పటికీ మరో ఆరుగురు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

భాజపా పనే..

తమ పార్టీ ఎమ్మెల్యేలకు భాజపా ఎరవేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు కాంగ్రెస్‌ ఆరోపించింది. పైలట్‌ వర్గం భాజపాలో చేరుతుందా అన్న ప్రశ్నకు అన్ని అవకాశాలు తెరుచుకునే ఉన్నాయంటూ కాంగ్రెస్‌ రాజస్థాన్‌ అధ్యక్షుడు సతీశ్‌ పునియా ఆసక్తికర సమాధానమిచ్చారు. కాంగ్రెస్‌లో యువ నాయకులను ఎప్పుడూ పట్టించుకోరంటూ వ్యాఖ్యానించారు. రాజస్థాన్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర జరుగుతోందన్న కేసులో స‌చిన్ పైల‌ట్‌కు పోలీసులు నోటీసులు జారీ చేయడంతో వివాదం ప్రారంభమైంది.

ఇదీ చూడండి: గహ్లోత్​ నాయకత్వానికే​ మా పూర్తి మద్దతు: సీఎల్​పీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.