ETV Bharat / bharat

'ఎన్నికలకు ​ముందే కాంగ్రెస్ ఓటమిని అంగీకరించింది' - భాజపా న్యూస్

హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ జరగకముందే కాంగ్రెస్ ఓటమిని అంగీకరించిందని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని ఆ పార్టీ నేతలే ఒప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. హరియాణా హిసార్​లో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు ప్రధాని.

'ఎన్నికలకు ​ముందే కాంగ్రెస్ ఓటమిని అంగీకరించింది'
author img

By

Published : Oct 18, 2019, 5:21 PM IST

Updated : Oct 18, 2019, 6:40 PM IST

'ఎన్నికలకు ​ముందే కాంగ్రెస్ ఓటమిని అంగీకరించింది'

భాజపాపై విశ్వాసంతోనే కేంద్రంలో, హరియాణాలో ప్రజలు అధికారమిచ్చారని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. అసెంబ్లీ ఎన్నికలు జరగకముందే కాంగ్రెస్ ఓటమి అంగీకరించిందని ఎద్దేవా చేశారు.

హరియాణా హిసార్​లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు మోదీ. కాంగ్రెస్ పాలన అవినీతిమయమని ఆరోపించారు.

"ప్రస్తుతం కాంగ్రెస్ దుస్థితి ఎలా ఉందో వాళ్ల మాటలను బట్టి అర్థమవుతోంది. వారి పరిస్థితి ఎలా ఉందో ఓ వీడియో ద్వారా తెలుస్తోంది. పార్లమెంట్ ప్రాంగణంలో కాంగ్రెస్ నేతలు హరియాణాకు చెందిన నాయకులను చిన్నచూపుతో చూస్తున్నారు. హరియాణా నేతలు మాత్రం చేతులు జోడించి వారికి నమస్కరిస్తున్నారు. ఆ వీడియో మీరు చూశారా? హరియాణాకు అవమానం జరగడం మీకు సబబేనా. అలాంటి కాంగ్రెస్ నేతలతో హరియాణా గౌరవం పెరుగుతుందా. వాళ్లు ఏం మాట్లాడారో స్పష్టంగా తెలుస్తోంది. 10-15సీట్లు గెలిస్తే చాలనుకుంటున్నారు. వాళ్లు ఇప్పటికే ఓటమిని అంగీకరించారు. పోటీ నుంచి తప్పుకున్నారు."
-నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి

దుష్యంత్​ చౌతాలా సారథ్యంలోని జన్​నాయక్ జనతా పార్టీ(జేజేపీ)పైనా విమర్శలు గుప్పించారు మోదీ. ఆ పార్టీ విధివిధానాలను హరియాణా ప్రజలు తిరస్కరించినట్లు చెప్పారు.

దుష్కృత్యాలు చేసిన ప్రభుత్వం కావాలో, సుపరిపాలన అందించే ప్రభుత్వం కావాలో తేల్చుకోవాలని హరియాణా ప్రజలకు సూచించారు మోదీ.

Intro:Body:

Hyderabad: Edible cups launched for serving hot and cold beverages

ANI Visuals

Conclusion:
Last Updated : Oct 18, 2019, 6:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.