ప్రధాని క్షమాపణలకు కాంగ్రెస్ డిమాండ్
ప్రజ్ఞా వ్యాఖ్యలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది కాంగ్రెస్ పార్టీ. ఆమెపై కఠిన చర్యలు తీసుకుని, భోపాల్ లోక్‌సభ అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాలంది. అమరవీరులను అవమానించటం భాజపా డీఎన్ఏలోనే ఉందని ఆరోపించారు ఆ పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సింగ్ సుర్జేవాలా.
భాజపా సభ్యులు గాడ్సే వారసులని స్పష్టంగా తెలుస్తోందన్నారు సుర్జేవాలా. గాడ్సేను దేశభక్తుడని, 26/11 ముంబయి ఉగ్రదాడిలో అమరుడు హేమంత్ కర్కరేను దేశద్రోహిగా చిత్రీకరించటం కాషాయ దళానికే చెల్లిందని విమర్శించారు.
ప్రజ్ఞాపై మీ వైఖరేంటీ?
ఈ విషయంపై కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా స్పందించారు. బాపుని హత్యచేసిన వ్యక్తి దేశభక్తుడా? అంటూ ట్వీట్ చేశారు. ప్రజ్ఞాను దూరంపెట్టి చేతులు దులుపుకోకుండా... పూర్తి వ్యవహారంపై తమ వైఖరి ఏమిటో భాజపా స్పష్టంగా తెలపాలని డిమాండ్ చేశారు.
-
बापू का हत्यारा देशभक्त?
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) May 16, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
हे राम!
Distancing yourself from your candidate is not enough. Nationalistic luminaries of the BJP, have the guts to spell out your stand.
">बापू का हत्यारा देशभक्त?
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) May 16, 2019
हे राम!
Distancing yourself from your candidate is not enough. Nationalistic luminaries of the BJP, have the guts to spell out your stand.बापू का हत्यारा देशभक्त?
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) May 16, 2019
हे राम!
Distancing yourself from your candidate is not enough. Nationalistic luminaries of the BJP, have the guts to spell out your stand.
మౌనం ఎందుకు?
భాజపాపై తీవ్ర విమర్శలు గుప్పించింది ఆమ్ఆద్మీ పార్టీ. గాడ్సేను ఉద్దేశించి ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ అనుచిత వ్యాఖ్యలు చేస్తే భాజపా నాయకత్వం ఎందుకు మౌనంగా ఉండిపోయిందని ప్రశ్నించింది. దేశాన్ని అభివృద్ధి చేయాల్సింది పోయి ధ్వంసం చేస్తున్నారని విమర్శించింది. దేశ ప్రజలు ఈ ప్రమాదకర పరిస్థితులను దృష్టిలో పెట్టుకోవాలని వెల్లడించింది. పార్టీ నుంచి ప్రజ్ఞాను ఎందుకు బహిష్కరించటం లేదని ప్రశ్నించింది.
ఇదీ చూడండి:క్షమాపణలు చెప్పిన సాధ్వి- నివేదిక కోరిన ఈసీ