హరియాణా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌పై కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. కాంగ్రెస్ అధ్యక్షురాలిగా సోనియాగాంధీ ఎన్నికపై ఆయన చేసిన వ్యాఖ్యలకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఖట్టర్ రాజ్యాంగ విరుద్ధంగా సోనియా గాంధీ గురించి మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సుష్మితా దేవ్. మహిళల పట్ల భాజపా పార్టీ, ఖట్టర్ దృక్పథాన్ని ఈ వ్యాఖ్యలు బయటపెట్టాయని విమర్శించారు.
"ఒక కాంగ్రెస్ నేతగా ప్రజాజీవితంలో గౌరవప్రదంగా వ్యవహరించేందుకు కట్టుబడి ఉన్నాము. కానీ ఒక మహిళగా... ఖట్టర్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇందుకు ఆయన బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం."
- సుష్మితా దేవ్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు
సోనియాపై ఖట్టర్ వ్యాఖ్యలు
కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ రాజీనామా చేసిన నేపథ్యంలో ఆ పార్టీ సారథిగా ఇటీవల మరోమారు బాధ్యతలు స్వీకరించారు సోనియా. అయితే ఆమె ఎన్నికపై ఆదివారం తీవ్ర ఆరోపణలు చేశారు ఖట్టర్. 'కొండను తవ్వి ఎలుకను పట్టారు' అనే సామెతను ఉపయోగిస్తూ విమర్శించారు.
ఇదీ చూడండి : కశ్మీర్లో పోస్ట్‌పెయిడ్ మొబైల్ సేవల పునరుద్ధరణ