ETV Bharat / bharat

దేశంలోని పరిస్థితులపై కాంగ్రెస్​ 'సలహా కమిటీ' - మాజీ ప్రధాని మన్మహన్ సింగ్

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అధ్యక్షతన సలహా కమిటీని ఏర్పాటు చేసింది కాంగ్రెస్​. దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై పార్టీ వ్యవహరించాల్సిన తీరుపై ఈ కమిటీ విధివిధాలను రూపొందించనున్నట్లు నాయకులు తెలిపారు.

Cong constitutes consultative group under Manmohan Singh to evolve party's policy on key issues
దేశ పరిస్థితులపై కాంగ్రెస్​ 'సలహా కమిటీ' ఏర్పాటు
author img

By

Published : Apr 18, 2020, 6:05 PM IST

Updated : Apr 18, 2020, 6:19 PM IST

దేశంలోని ప్రస్తుత పరిణామాలు, సమస్యలపై పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలను రూపొందించటానికి మాజీ ప్రధాని మన్మోహన్​ సింగ్​ అధ్యక్షతన 'సలహా కమిటీ' ని ఏర్పాటు చేసింది కాంగ్రెస్​. ఈ కమిటీకి కన్వీనర్​గా ఆ పార్టీ అధికార ప్రతినిధి రణ్​దీప్ సుర్జేవాలా వ్యవహరించనున్నారు.

"మన్మోహన్​ సింగ్​ అధ్యక్షతన 'సలహా కమిటీ'ని కాంగ్రెస్​ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఏర్పాటు చేశారు . ఈ కమిటీ దేశంలోని ప్రస్తుత పరిణామాలు, సమస్యలపై పార్టీ అనుసరించాల్సిన విధివిధానాలను రూపొందిస్తుంది."

-కేసీ వేణుగోపాల్​, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి

ఈ కమిటీలో కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ, కేంద్ర మాజీ మంత్రులు చిదంబరం, జైరాం రమేశ్​తో పాటు ఇతర ముఖ్య నేతలు కూడా కీలక సభ్యులుగా ఉన్నారు.

కరోనా అతిపెద్ద సవాల్​...

దేశానికి కరోనా వైరస్​ అతి పెద్ద సవాల్​గా మారిందని అన్నారు కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ. ఈ సంక్షోభ సమయంలో పరిష్కార మార్గాలను కనుగొనేందుకు శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, డేటా నిపుణులను సంఘటితం చేయాలని ట్విట్టర్​లో సూచించారు. కరోనా వైరస్ నియంత్రణకు లాక్​డౌన్​ను విధించటం ఒక్కటే పరిష్కార మార్గం కాదన్నారు రాహుల్.. అధిక సంఖ్యలో వైరస్​ పరీక్షలు నిర్వహించటమే ప్రధాన ఆయుధం అని అన్నారు.

Last Updated : Apr 18, 2020, 6:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.