ETV Bharat / bharat

కాంగ్రెస్​ 'దిద్దుబాటు'- ఆ రాష్ట్రాలకు కొత్త సారథులు - కాంగ్రెస్​ కర్ణాటక అధ్యక్షుడు

రాజకీయంగా తీవ్ర గడ్డు కాలం ఎదుర్కొంటున్న కర్ణాటక, దిల్లీలో నాయకత్వ పగ్గాల్ని కొత్త వ్యక్తులకు అప్పగించింది కాంగ్రెస్. కర్ణాటక పీసీసీ అధ్యక్షుడిగా శివ కుమార్, దిల్లీ సారథిగా అనిల్ చౌదరిని నియమించింది.

Cong appoints D K Shivakumar as its Karnataka unit chief
కాంగ్రెస్​ 'దిద్దుబాటు'- ఆ రాష్ట్రాలకు కొత్త సారథులు
author img

By

Published : Mar 11, 2020, 5:58 PM IST

కర్ణాటక, దిల్లీ ప్రదేశ్​ కాంగ్రెస్​ కమిటీలకు కొత్త అధ్యక్షుల్ని నియమించింది కాంగ్రెస్. ఆ రెండు రాష్ట్రాల్లో గట్టి ఎదురుదెబ్బలు సహా మధ్యప్రదేశ్​లో రాజకీయ సంక్షోభం నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టింది.

కాంగ్రెస్​ కర్ణాటక అధ్యక్షుడిగా సీనియర్ నేత డీకే శివకుమార్​ను ఎంపిక చేసింది అధిష్ఠానం. అత్యంత సంక్షోభ పరిస్థితుల్లోనూ పార్టీకి వెన్నంటి ఉండే ఈయనను దినేశ్​ గుండూ రావ్​ స్థానంలో నియమించింది. ఈశ్వర్​ ఖండ్రే, సతీశ్​ ఝార్కిహోలి, సలీమ్​ అహ్మద్​కు​ కార్యనిర్వాహక అధ్యక్షులుగా బాధ్యతలు అప్పగించింది. మాజీ ముఖ్యమంత్రి సిద్ధిరామయ్య కర్ణాటక శాసనసభలో ప్రతిపక్ష నేతగా కొనసాగనున్నారు.

అంతా కలిసి కాంగ్రెస్​ను పటిష్ఠం చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు శివ కుమార్.

దిల్లీలోనూ...

దిల్లీ అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్యే అనిల్​ చౌదరిని నియనించింది కాంగ్రెస్​. ఈయనతో పాటు అభిషేక్​ దత్​, శివాని చోప్రా, జైకిషన్​, ముదిత్​ అగర్వాల్​, అలీ హాసన్​లను ఉపాధ్యక్షులుగా ఎంపిక చేసింది.

దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయానికి నైతిక బాధ్యత వహిస్తూ శుభాష్​ చోప్రా అధ్యక్ష పదవికి ఫిబ్రవరిలో రాజీనామా చేశారు.

ఇదీ చదవండి: మాస్కులతో దర్శనమిస్తున్న దేవుళ్ల విగ్రహాలు..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.