అయితే... మోదీ 'తనకు పాక్ జాతీయ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ లేఖ రాశారని' ఇమ్రాన్ చేసిన ట్వీట్లో ఎంత వరకు నిజముందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి ప్రియాంక చతుర్వేది పీఎంవోను ప్రశ్నించారు. మోదీ లేఖపంపారా అని ప్రధానమంత్రి కార్యాలయాన్ని ఆరా తీసింది కాంగ్రెస్ పార్టీ. ఇమ్రాన్ ట్వీట్ చేసిన సందేశం యథాతథంగా మోదీ పంపినదేనా అని ప్రశ్నించింది.
ఈ లేఖలో మోదీ... "ఉపఖండంలోని ప్రజలు ప్రజాస్వామ్య, శాంతియుత, ప్రగతిశీల, సంపన్న ప్రాంతాల కోసం కలిసి పనిచేయడానికి సమయం ఆసన్నమైందని తెలిపారు. తీవ్రవాదం, హింసాకాండ లేని వాతావరణంలో ఇరు దేశాల ప్రజలు కలిసి పనిచేయాలని సందేశం అందించారు."
భారత్లోని పాక్ రాయబార కార్యాలయంలో శనివారం నిర్వహించాల్సిన విందును భారత్ బహిష్కరించింది. జమ్ముకశ్మీర్ వేర్పాటువాదులను ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన కారణంగా భారత్ ఈ నిర్ణయం తీసుకుంది.