భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు భారతరత్న అవార్డు ఇవ్వాలని కోరారు కాంగ్రెస్ ముఖ్య నేత వీరప్ప మొయిలీ . దేశ అత్యున్నత పురస్కారం అందుకోవడానికి పీవీ నరసింహ రావుతో పాటు మన్మోహన్కూ అన్ని అర్హతలున్నాయని తెలిపారు.
పీవీ నరసింహ రావు శత జయంత్యుత్సవాల సందర్భంగా.. మరణాంతరం ఆయనకు భారతరత్న ఇవ్వాలని తెలంగాణ అసెంబ్లీ మంగళవారం తీర్మానించిన నేపథ్యంలో మొయిలీ ఈ వ్యాఖ్యలు చేశారు.
'దేశ అత్యున్నత పురస్కారానికి పీవీకి అన్ని అర్హతలూ ఉన్నాయి. ఆయనతో పాటు ఆర్థిక రంగంలో మన్మోహన్ సింగ్ కూడా ఎనలేని కృషి చేశారు. రావు ప్రధానిగా బాధ్యతలు స్వీకరించినప్పుడు దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో ఉంది. ఆ సమయంలో ప్రధాని పీవీ, ఆర్థిక మంత్రి మన్మోహన్ ప్రగతి రథాన్ని తిరిగి గాడిలో పెట్టారు. ఈ ఘనత ఇరువురుకీ దక్కుతుంది. కాబట్టి ఇద్దరికీ భారతరత్న ఇవ్వడం సముచితం.'
- ఎం. వీరప్ప మొయిలీ, కాంగ్రెస్ నేత
ఇదీ చదవండి: ప్లాస్టిక్ సీసా వద్దు... కూజానే ముద్దు: మోదీ