బిహార్‌ను వరదలు ముంచెత్తుతున్నాయి. నదులు ఉగ్రరూపం దాల్చడం వల్ల తోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. దీంతో 14 జిల్లాల్లోని 1012 గ్రామాల్లో 45.39లక్షల మందికిపైగా ప్రభావితమయ్యారు. 11 మంది వరదల కారణంగా మృతి చెందారు.
ఇప్పటివరకు వరద ప్రభావిత ప్రాంతాల నుంచి 3.76 లక్షల మందిని ఖాళీ చేయించగా.. 26,732 మంది పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం పొందుతున్నట్లు రాష్ట్ర విపత్తు నిర్వహణ అధికారులు తెలిపారు. 12 జిల్లాల్లో 21 ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను మోహరించినట్లు వెల్లడించారు.
ఈ ఏడాది చివర్లో బిహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టేందుకు ప్రతిపక్షాలకు ఇదొక అంశంగా దొరికినట్లయింది. వరదల కారణంగా తూర్పు చంపారన్ జిల్లాలో ప్రజలు నిలువు నీడలేకుండా ఇబ్బందులు పడుతుంటే.. కేవలం 19 పునరావాస కేంద్రాలే ఏర్పాటు చేయడంపై అసహనం వ్యక్తం చేశారు ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్.
ఇదీ చూడండి: సిలిండర్ సమక్షంలో డీజిల్‌ను పెళ్లాడిన పెట్రోల్