ETV Bharat / bharat

ప్రగ్యా 'గాడ్సే' వ్యాఖ్యలపై దుమారం- భాజపా కఠిన చర్యలు

author img

By

Published : Nov 28, 2019, 1:55 PM IST

Updated : Nov 28, 2019, 3:57 PM IST

నాథూరాం గాడ్సే దేశభక్తుడని భాజపా ఎంపీ ప్రగ్యాసింగ్ ఠాకూర్​ కీర్తించడంపై లోక్​సభ దద్దరిల్లింది. ఆమె​పై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ సభ్యులు పట్టుబట్టారు. ప్రగ్యా వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు రక్షణమంత్రి రాజ్​నాథ్​సింగ్ ప్రకటించారు. అయితే సంతృప్తి చెందని విపక్షసభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు.

pragya
ప్రగ్యా 'గాడ్సే' వ్యాఖ్యలపై దుమారం- భాజపా కఠిన చర్యలు
ప్రగ్యా 'గాడ్సే' వ్యాఖ్యలపై దుమారం- భాజపా కఠిన చర్యలు

మహాత్మాగాంధీని హత్య చేసిన నాథూరాం గాడ్సేను దేశభక్తుడని భాజపా ఎంపీ, సాధ్వీ ప్రగ్యాసింగ్ వ్యాఖ్యలు చేయడంపై పెను దుమారం రేగింది. ఈ వ్యవహారంపై చర్చ కోరుతూ కాంగ్రెస్ సభ్యులు లోక్​సభలో వాయిదా తీర్మానం ఇచ్చారు. ప్రగ్యా​పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

కాంగ్రెస్​ను ఉగ్రవాద పార్టీగా ప్రగ్యా వ్యాఖ్యానించడంపై కాంగ్రెస్ సభాపక్షనేత అధిర్ రంజన్ చౌదరి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశానికి కాంగ్రెస్ చేసిన సేవలు మరువలేనివని స్పష్టం చేశారు.

"వేలమంది కాంగ్రెస్ సభ్యులు దేశానికి సేవచేస్తూ చనిపోయారు. కాంగ్రెస్ గురించి అలా మాట్లాడేందుకు ఆమెకు ఎంతధైర్యం? అదీ సభలో. మేం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. "

-అధిర్ ​రంజన్ చౌదరి, కాంగ్రెస్ పక్షనేత

రాజ్​నాథ్​ వివరణ

ప్రగ్యాసింగ్ వ్యాఖ్యలు భాజపాను రక్షణాత్మక ధోరణిలో పడేసిన నేపథ్యంలో కేంద్రమంత్రి రాజ్​నాథ్​ సింగ్​ స్పందించారు.

"నాథూరాం గాడ్సేను దేశభక్తుడిగా పిలవడం కాదు... కనీసం ఆ ఆలోచన కూడా రానీయకూడదు. ప్రగ్యా వ్యాఖ్యలను ఖండిస్తున్నాం. మహాత్మాగాంధీ మనకు మార్గదర్శకుడు. మార్గదర్శకుడిగానే ఉంటారు. ఆయన ఆలోచనలు నాడు, నేడు, ఎప్పటికీ ఆచరణీయం. జాతి, వర్గ భేదం లేకుండా అందరికీ ఆయన ఆదర్శప్రాయులు. వారి నుంచి స్ఫూర్తి పొందుతూనే ఉంటారు."

-లోక్​సభలో రాజ్​నాథ్​సింగ్

అయితే రాజ్​నాథ్ వివరణతో సంతృప్తి చెందని కాంగ్రెస్, తృణమూల్, వామపక్ష పార్టీలు, ఎన్​సీపీ, ఏఐఎంఐఎం సభ్యులు సభనుంచి వాకౌట్ చేశారు.

పార్లమెంట్ చరిత్రలో చీకటిరోజు: రాహుల్ గాంధీ

ప్రగ్యాసింగ్​ వ్యాఖ్యల్ని తీవ్రంగా తప్పుబట్టారు కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ. ఒక ఉగ్రవాది మరొక ఉగ్రవాదిని కీర్తించినట్లు ఉందని మండిపడ్డారు. ఇది పార్లమెంట్ చరిత్రలో చీకటి రోజని వ్యాఖ్యానించారు.

సాధ్వీపై భాజపా చర్యలు

రాజకీయ దుమారం నేపథ్యంలో ప్రగ్యా​పై చర్యలు తీసుకుంది భారతీయ జనతా పార్టీ. పార్లమెంటరీ పార్టీ సమావేశాలకు రాకుండా నిషేధం విధించింది. రక్షణ వ్యవహారాలపై సంప్రదింపుల కోసం ఏర్పాటైన పార్లమెంటరీ కమిటీ నుంచి ఆమెను తప్పించింది.

ప్రగ్యా వివరణ

pragya
ప్రగ్యా ట్వీట్

లోక్​సభలో బుధవారం గాడ్సేను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు ప్రగ్యా. విప్లవకారుడు ఉదమ్​సింగ్​పై కొందరు అభ్యంతరకర రీతిలో చేసిన వ్యాఖ్యలపైనే అలా స్పందించానని స్పష్టం చేశారు.

లోక్​సభ ఎన్నికల ప్రచార సమయంలోనూ ఇలానే గాడ్సేను కీర్తించారు ప్రగ్యా. అప్పుడు కూడా పెను దుమారం రేగగా.... క్షమాపణ చెప్పారు.

ఇదీ చూడండి: బంగాల్​ ఉపఎన్నికల్లో భాజపాకు షాక్​- మమత 'రివర్స్'​ పంచ్​

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Hong Kong - 28 November 2019
1. Police sorting through rubbish at the Polytechnic University  
2. Wide of cordoned off area of the university campus, police moving numerous items in the background
3. Various of police moving crate with a crossbow, bows
4. Wide of campus outside area littered with rubbish
5. Various of police sifting through and removing items
STORYLINE:
Police teams on Thursday began clearing a Hong Kong university that was a flashpoint for clashes with anti-government demonstrators.
The move into the Polytechnic University came after its administration said they believed no one else remained inside after a two-day search ended Wednesday.
Faculty teams found only a young woman in weak condition and a stockpile of dangerous items including petrol bombs and corrosive liquid.
The Polytechnic University has been ringed by police for 11 days as protesters retreated into the campus after blocking a major tunnel and set toll booths on fire during clashes with police.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Nov 28, 2019, 3:57 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.