ETV Bharat / bharat

కరోనా హాట్​స్పాట్లుగా మారిన పల్లెలు - corona cases in rural areas

దేశంలో కరోనా విజృంభిస్తోంది. ఇప్పటివరకు పట్టణాలకే పరిమితమైన ఈ మహమ్మారి గ్రామీణ ప్రాంతాలను వణికిస్తోంది. తాజాగా నమోదవుతున్న కేసుల్లో ఎక్కువగా పల్లె ప్రాంతాల్లో వెలుగుచూస్తున్నాయి. మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్​, ఒడిశా, గుజరాత్​, గోవా రాష్ట్రాల్లో అత్యధికంగా బయటపడుతున్నాయి.

Concerns about COVID-19 spread to rural India spike as cases race past 40 lakh mark
పల్లెలను వణికిస్తోన్న కరోనా
author img

By

Published : Sep 5, 2020, 4:55 PM IST

దేశంలో కరోనా వ్యాప్తి అధికంగా ఉంది. దేశ వ్యాప్తంగా సెప్టెంబర్​ 5 వరకు 40 లక్షల మందికిపైగా కరోనా బారిన పడ్డారు. 69,561 మంది మృతి చెందారు. 30 లక్షల నుంచి 40 లక్షల మార్క్​ను అందుకోవటానికి కేవలం13 రోజుల సమయం పట్టింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు గల దేశాల్లో మరో రెండు రోజుల్లో బ్రెజిల్​ను​ దాటి రెండో స్థానానికి ఎగబాకనుంది భారత్​. ఇప్పటి వరకు ప్రధాన నగరాలకు, పట్టణాలకు పరిమితమైన ఈ వైరస్ దేశానికి పట్టుకొమ్మలు లాంటి పల్లెల్లో తన ప్రతాపం చూపడం ప్రారంభించింది. తాజాగా నమోదవుతున్న కేసుల్లో ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల నుంచి రావటంపై నిపుణులు ఆందోళన చెందుతున్నారు. హౌ ఇండియా లైవ్స్ వెబ్​సైట్ ప్రకారం దేశంలోని 714 జిల్లాలో కరోనా వ్యాప్తి చెందిందని, 94.16 శాతం మందికి ప్రమాదం పొంచి ఉన్నట్లు పేర్కొంది.

చిన్న చిన్న పట్టణాలు, గ్రామాల్లోనూ కరోనా కేసులు ఎక్కువగా బయటపడుతున్నాయని, దీనిని బట్టి చూస్తే గ్రామాల్లోనూ సామాజిక వ్యాప్తి దశకు చేరిందని భావించవచ్చని సీరో సర్వే గత వారం ఓ నివేదికను వెల్లడించింది. మహమ్మారి వచ్చి ఆరు నెలల అయినప్పటికీ దీనిపై భయం, వివక్షత తగ్గలేదని ఆరోగ్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు.

రాష్ట్రాల వారీగా....

  • మహారాష్ట్రను కరోనా వైరస్ వణికిస్తోంది. పట్టణాల్లోనే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో కేసులు,మరణాలు ఎక్కువగా ఉంటున్నాయని ఆ రాష్ట్ర అధికారులు తెలిపారు. ఆగస్టు 26 వరకు నమోదైన 7 లక్షల కేసులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 17 వేల మునిసిపల్ కార్పొరేషన్లు, 5,371 గ్రామీణ ప్రాంతాల్లో వెలుగుచూసినట్లు పేర్కొన్నారు.
  • ఒడిశాలో కరోనా బారిన పడిన వారిలో 60 శాతం గ్రామాల్లోనే నమోదైనట్లు ఆ రాష్ట్ర అధికారులు తెలిపారు. వీరిలో ఎక్కువ మంది దిల్లీ, ముంబయి, సూరత్​ ప్రాంతాల నుంచి వచ్చిన వలస కార్మికుల కారణంగా వ్యాప్తి చెందిందని భావిస్తున్నారు.
  • తమిళనాడులో రోజూ 70 వేలకు పైగా ఆర్​టీపీసీఆర్ టెస్టులను చేస్తున్నామని, అందువల్ల ఎక్కువ కేసులు వెలుగు చూస్తున్నట్లు ఆ రాష్ట్ర అధికారులు వెల్లడించారు. తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.
  • ఆంధ్రప్రదేశ్​లో ఇప్పటి వరకు నమోదైన కేసుల్లో 40 శాతం కేసులు గ్రామీణ ప్రాంతాల్లో వెలుగు చూశాయి.
  • మధ్యప్రదేశ్​లోని 52 జిల్లాలో 51 గ్రామీణ ప్రాంతాల్లో కరోనా వ్యాప్తి చెందింది.
  • గోవాలో 50 శాతం కేసులు పల్లెల్లో నమోదయ్యాయి.
  • గుజరాత్​లోనూ నమోదైన కేసుల్లో గ్రామీణ ప్రాంతాల నుంచి వస్తున్నట్లు అధికారులు తెలిపారు.
  • ఉత్తర్​ప్రదేశ్​లో ప్రత్యేక పర్యవేక్షణ బృంద సభ్యులు ఎప్పటికప్పుడు టెస్టు చేస్తూ వైరస్ కట్టడి చర్యలు తీసుకుంటున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.