ETV Bharat / bharat

చలిపులి ధాటికి ఉత్తర భారతం గజగజ

ఉత్తర భారతంలో చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. దేశ రాజధాని దిల్లీ సహా జమ్ముకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్​లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం పూట దట్టమైన పొగమంచు కమ్మేస్తున్న కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయి.

cold
చలికి ఉత్తర భారతం గజగజ
author img

By

Published : Dec 31, 2019, 6:01 AM IST

Updated : Dec 31, 2019, 7:36 AM IST

ఉత్తరాది రాష్ట్రాలను చలిపులి వణికిస్తోంది. దేశ రాజధాని దిల్లీ, జమ్ముకశ్మీర్ సహా పలు రాష్ట్రాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీనితో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దట్టమైన పొగమంచు ఉంటున్న నేపథ్యంలో దారి కనిపించక ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి.

దిల్లీలో...

దిల్లీలో పగటి పూట అత్యల్ప ఉష్ణోగ్రత నమోదయింది. సోమవారం గరిష్ఠ ఉష్ణోగ్రతే 9.4గా రికార్డయింది. గత వారం నుంచి దిల్లీలో స్వల్ప ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్న కారణంగా అనారోగ్యానికి గురై ప్రజలు ఆసుపత్రులకు చేరుతున్నారు. ఆసుపత్రికి వచ్చే వారి సంఖ్య 15-20 శాతం పెరిగిందని ఎయిమ్స్ డైరెక్టర్ రణ్​దీప్ గులేరియా వెల్లడించారు. చలి కారణంగా శ్వాస సమస్యలు, న్యూమోనియా వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉందని, జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. చిన్నపిల్లలు, 60 ఏళ్లు పైబడిన వృద్ధులపై చలి ప్రభావం అధికంగా ఉంటుందని వెల్లడించారు.

రహదారిని పొగమంచు కప్పేసిన నేపథ్యంలో ఉత్తర్​ప్రదేశ్​ నుంచి దిల్లీకి వెళుతున్న ఓ వాహనం అదుపు తప్పి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు.

జమ్ములో...

హిమాలయ ప్రాంతమైన జమ్ముకశ్మీర్​లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 2.4 డిగ్రీల సెల్సియస్​తో దశాబ్దంలోనే అత్యంత శీతలమైనదిగా సోమవారం రాత్రి రికార్డులకెక్కింది. పొగమంచు కారణంగా జమ్ము విమానాశ్రయంలో ఉదయం పూట విమాన సర్వీసులన్నీ రద్దయ్యాయి. శ్రీనగర్​లో -6.5 డిగ్రీల సెల్సియస్​ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ద్రాస్​లో -28.8, లద్దాఖ్​లో -20.1, పాల్గాంలో 10.2, కశ్మీర్​లోయలో -9.3, కోకెర్​నాగ్​లో -7.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

హిమాచల్...

శీతలగాలులు వీస్తున్న కారణంగా హిమాచల్ ప్రదేశ్​లో జనజీవనం స్తంభించిపోయింది. చలికాలంలో సాధారణం కంటే రెండు డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు క్షీణించాయి. కైలాంగ్​ ప్రాంతంలో -11.8 డిగ్రీల సెల్సియస్​ నమోదయింది. కిన్నౌర్​ జిల్లాలోని కల్పాలో -2 డిగ్రీలు, సుందర్​నగర్​లో -2.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.

రాజస్థాన్​...

గత కొద్ది రోజులుగా రాజస్థాన్​లోనూ చలి తీవ్రత పెరిగింది. రాష్ట్రంలోని అనేక ప్రాంతాలు చలి ప్రభావంతో వణికిపోతున్నాయి. శిఖర్ జిల్లాలో -0.5 డిగ్రీల సెల్సియస్​ నమోదయింది.

ఇదీ చూడండి: కాలువలోకి దూసుకెళ్లిన కారు.. ఆరుగురు మృతి

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com. Must credit ESPN
SHOTLIST: Metlife Stadium, East Rutherford, New Jersey, USA. 30th December, 2019.
1. 00:00 SOUNDBITE (English): John Mara, New York Giants Owner:
"Steve (Tisch), Dave (Gettleman) and I met with Pat Shurmur and informed him that we're making a change at our head coaching position. These decisions are never easy, particularly when you have someone like Pat with his character, his integrity, his work ethic but at the end of the day we just didn't win enough games and we believe that we have to move in another direction. Certainly not all Pat's fault, he did a lot of good things here - in particular his role in selecting and training Daniel Jones. It's a difficult day when you have to do something like this, the first thing that I always think of is the effect that it has on so many good people and their families but at the end of the day it was a decision we just felt like we had to make going forward."
2. 00:50 SOUNDBITE (English): John Mara, New York Giants Owner:
"With Pat it just was a ... ends up being as much a gut instinct as anything else. I just felt like we weren't winning enough games, we weren't winning the games that we should have won and we just need to go in a different direction."
3. 01:03 SOUNDBITE (English): John Mara, New York Giants Owner:
"Really looking for leadership, that's the big thing going forward. Somebody who can come in, take control of this roster, help build a culture that is going to lead to winning. Somebody who's going to help us with our football reorganization that we're in the process of undergoing right now ... we're looking for all those qualities from the next candidate."
4. 01:25 SOUNDBITE (English): John Mara, New York Giants Owner:
"Been too many years since we've had a winning team on the field and nobody feels that more than Steve and myself. It's not easy to sit in your stadium and watch fans from the other team, you know, and that's happened too often this year. So, believe me, we live this every day, we feel it as much if not moreso than the fans do and we're committed to trying to get this thing right."
SOURCE: ESPN
DURATION: 01:53
STORYLINE:
The New York Giants have fired coach Pat Shurmur after the once-proud franchise took a step back by winning four games in a season marked by a franchise record-tying nine-game losing streak.
Co-owners John Mara and Steve Tisch informed Shurmur of the decision Monday, less than a day after the Giants (4-12) failed to play the spoiler role and saw the Philadelphia Eagles beat them 34-17 to win the NFC East.
The four-time Super Bowl champions have missed the playoffs seven times in eight years. This was Shurmur's second head coaching job. He went 9-23 in two seasons with the Browns, the same record he had with the Giants.
Last Updated : Dec 31, 2019, 7:36 AM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.