ETV Bharat / bharat

బొగ్గు కుంభకోణంలో దోషిగా కేంద్ర మాజీ మంత్రి

బొగ్గు బ్లాక్‌ను కేటాయించడంలో జరిగిన అవకతవకలకు సంబంధించిన కుంభకోణం కేసులో కేంద్ర మాజీ మంత్రి దిలీప్ రే​ దోషిగా తేలారు. ఆయనతో పాటు బొగ్గు శాఖలో పనిచేసిన అధికారులను ఝార్ఖండ్​లోని ప్రత్యేక న్యాయస్థానం దోషులుగా తేల్చింది.

Coal scam: Court convicts ex-Minister Dilip Ray, others
బొగ్గు కుంభకోణంలో దోషిగా కేంద్ర మాజీ మంత్రి
author img

By

Published : Oct 6, 2020, 11:32 AM IST

కేంద్ర మాజీ మంత్రి దిలీప్‌ రేను బొగ్గు కుంభకోణం కేసులో దోషిగా తేలుస్తూ ఝార్ఖండ్ ప్రత్యేక న్యాయస్థానం తీర్పు వెల్లడించింది. 1999లో ఝార్ఖండ్‌లో బొగ్గు బ్లాక్‌లను కేటాయించడంలో అక్రమాలకు పాల్పడ్డారన్న అభియోగంపై ఈ మేరకు కోర్టు తీర్పు వెలువరించింది. వాజ్​పేయీ హయాంలో బొగ్గు గనుల శాఖ మంత్రిగా దిలీప్ రే​ పనిచేశారు.

Coal scam: Court convicts ex-Minister Dilip Ray, others
దిలీప్ రే(వృత్తంలో)

దిలీప్​తో పాటు కుంభకోణం జరిగిన సమయంలో బొగ్గు గనుల మంత్రిత్వ శాఖలో పనిచేసిన ప్రదీప్ కుమార్ బెనర్జీ, నిత్యానంద్ గౌతమ్, కాస్ట్రోన్ టెక్నాలజీస్ లిమిటెడ్​తో పాటు ఆ సంస్థ డైరెక్టర్ మహేంద్ర కుమార్ అగర్వాలా, కాస్ట్రోన్ మైనింగ్ లిమిటెడ్​లను దోషులుగా తేల్చుతూ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి పరాషార్​ ఈ మేరకు తీర్పు వెలువరించారు.

దోషులకు శిక్ష విధింపుపై అక్టోబర్ 14న వాదనలు జరగనున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.