ETV Bharat / bharat

సీఎం కార్యాలయ సిబ్బందికి కరోనా.. ఆఫీసుకు సీల్​

పుదిచ్చేరి ముఖ్యమంత్రి కార్యాలయంలో సిబ్బందికి కరోనా సోకినట్లు నిర్ధరించారు. దీంతో రెండు రోజుల పాటు ఆఫీసును మూసివేయనున్నట్లు సీఎం నారాయణస్వామి తెలిపారు. బాధితుడు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు.

CM's office to be shut after staff gets infected by COVID-19
సీఎం ఆఫీసులో కరోనా.. ఆఫీసుకు షీల్​
author img

By

Published : Jun 27, 2020, 5:53 PM IST

కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి ముఖ్యమంత్రి కార్యాలయంలో ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్​ అని తేలింది. దీంతో రెండు రోజులపాటు కార్యాలయాన్ని మూసివేసినట్లు సీఎం వనారాయణస్వామి వెల్లడించారు. వైరస్ వ్యాప్తి నివారణలో భాగంగా భవనానికి శానిటైజ్​ చేయించనున్నట్టు తెలిపారు.

శుక్రవారం ఒక్కరోజులోనే ఈ కేంద్రపాలిత ప్రాంతంలో 87 కేసులు నమోదు కాగా.. అందులో సీఎం కార్యాలయ సిబ్బంది కూడా ఉన్నారని ముఖ్యమంత్రి తెలిపారు. ఈ నేపథ్యంలో సీఎంఓను సందర్శించవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బాధితుడు ప్రస్తుతం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్టు వెల్లడించారు.

పుదుచ్చేరివ్యాప్తంగా ఇప్పటివరకు 619 మంది వైరస్​ బారిన పడగా.. 10 మంది మృతి చెందారు.

ఇదీ చూడండి: వందేళ్ల బామ్మ కరోనాను జయించింది

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.