ETV Bharat / bharat

భేష్‌..కరోనా భయం వెంటాడినా సాహసించారు - Kozhikode flight accident death toll

విమాన ప్రమాద ఘటనలో సహాయం చేయడానికి వెళ్లిన స్థానికులు, అధికారులను ప్రశంసించారు కేరళ సీఎం పినరయి విజయన్​. భారీ వర్షాల కారణంగా వాతావరణం సహకరించకపోయినా.. కరోనా భయం వెంటాడుతున్నా తోటి మనుషులను కాపాడుకోవాలనే సంకల్పంతో సాహసోపేతంగా వ్యవహరించారని కొనియాడారు

CM Vijayan lauds locals who rushed to help in rescue efforts after crash
భేష్‌..కరోనా భయం వెంటాడినా సాహసించారు!
author img

By

Published : Aug 8, 2020, 3:41 PM IST

కేరళలోని కోజికోడ్‌ విమాన ప్రమాద ఘటనలో క్షతగాత్రులను గవర్నర్‌ ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌, సీఎం పినరయి విజయన్‌ పరామర్శించారు. వారిద్దరూ కొజికోడ్‌ వైద్య కళాశాలను సందర్శించారు. ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం విజయన్‌.. ప్రమాదం జరిగిన వెంటనే అక్కడి స్థానికులు, అధికారులు ప్రతిస్పందించిన తీరును ట్విటర్‌లో ప్రశంసించారు.

భారీ వర్షాల కారణంగా వాతావరణం సహకరించకపోయినా.. కరోనా భయం వెంటాడుతున్నా తోటి మనుషులను కాపాడుకోవాలనే సంకల్పంతో సాహసోపేతంగా వ్యవహరించారని కొనియాడారు. విమాన ప్రమాదంలో బాధితులకు రక్తదానం చేసేందుకు భారీ సంఖ్యలో ప్రజలు క్యూ కట్టడం దీనికి మరో ఉదాహరణగా నిలుస్తోందని పేర్కొన్నారు.

ప్రతికూల పరిస్థితులు ఏర్పడినప్పుడు వాటితో పోరాడటం కేరళ ప్రజలకు కొత్తేం కాదన్నారు. ఇదివరకే చాలాసార్లు చూశామని తెలిపారు. మానత్వం, మంచితనం తమ సమాజంలో అడుగడుగునా ఉందన్నారు. ఈ సందర్భంగా మలప్పురం, కొజికోడ్‌ జిల్లాల ప్రజలను అభినందించారు.

CM Vijayan lauds locals who rushed to help in rescue efforts after crash
విమాన శిథిలాలు

22 మంది పరిస్థితి విషమం

కొజికోడ్‌లో నిన్న రాత్రి చోటుచేసుకున్న ఘోర విమాన ప్రమాదంలో గాయపడిన ప్రయాణికుల్లో 149 మంది వివిధ ఆస్పత్రుల్లో చేరి చికిత్స పొందుతున్నారు. వారిలో 22 మంది ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. మరో 22 మందికి చిన్నచిన్నగాయాలే కావడం వల్ల ప్రాథమిక చికిత్స అనంతరం ఇళ్లకు తరలించారు.

వారందరికీ కొవిడ్‌ పరీక్షలు

విమానాశ్రయంలో సహాయక చర్యల్లో పాల్గొన్న వారంతా స్వీయ నిర్బంధంలోకి వెళ్లాలని కేరళ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. వారందరికీ కరోనా నిర్ధరణ పరీక్షలు చేస్తామని వైద్య శాఖ మంత్రి కేకే శైలజ తెలిపారు. మరోవైపు, కొవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా 30 మంది సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బంది హోం క్వారంటైన్‌లోకి వెళ్లినట్టు సమాచారం.

ఇదీ చూడండి: రెండు సార్లు ప్రయత్నించినా.. ప్రమాదం తప్పలేదు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.