ETV Bharat / bharat

రాష్ట్ర ప్రజలందరికీ ఉచితంగానే టీకా- సీఎం ప్రకటన

కేరళ వాసులందరికీ ఉచితంగానే కరోనా వ్యాక్సిన్ అందజేస్తామని ఆ రాష్ట ముఖ్యమంత్రి పినరయ విజయన్ ప్రకటించారు. రాష్ట్రంలో ఏ ఒక్కరూ టీకా కోసం డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.

cm pinarayi vijayan has announced corona vaccine will be free of cost for keral state people
'కేరళలో అందరికీ ఉచితంగా వ్యాక్సిన్ అందిస్తాం'
author img

By

Published : Dec 12, 2020, 10:39 PM IST

కేరళ రాష్ట్రంలో ప్రజలందరికీ ఉచితంగానే కరోనా వ్యాక్సిన్‌ అందించనున్నట్టు ఆ రాష్ట్ర సీఎం పినరయి విజయన్‌ ప్రకటించారు. కరోనా వ్యాక్సిన్‌ లభ్యత గురించే ఆలోచించాల్సిన అవసరం ఉందని, రాష్ట్రంలో ఈ వ్యాక్సిన్‌ కోసం ఛార్జీలు విధించే ఉద్దేశం తమ ప్రభుత్వానికి లేదని స్పష్టంచేశారు. ఉచితంగా కరోనా టీకా పంపిణీ చేస్తామని ప్రకటించిన రాష్ట్రాల్లో కేరళ మూడోది. ఇప్పటికే తమిళనాడు సీఎం పళనిస్వామి, మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ వ్యాక్సిన్‌ అందుబాటులోకి రాగానే ప్రజలకు ఉచితంగా పంపిణీ చేస్తామని ప్రకటించారు.

స్థానిక సంస్థల ఎన్నికల ప్రచార సభలకు హాజరు కాకపోవడంపై విపక్షాలు చేస్తున్న ఆరోపణలపైనా సీఎం విజయన్‌ స్పందించారు.

"ప్రచారం అంటే ప్రజలను సమీకరించడం. ఈ కరోనా మహమ్మారి సమయంలో ఇది వాంఛనీయం కాదు. నేను సమావేశాలకు హాజరైతే పెద్ద ఎత్తున జనం గుమిగూడుతారు. నా ఎన్నికల ప్రచారం ఆన్‌లైన్‌లో కొనసాగుతోంది. నేనూ ప్రజలకు దూరం కాలేదు.. వారూ నన్ను దూరం చేసుకోలేదు."

--పినరయి విజయన్, కేరళ ముఖ్యమంత్రి

కేరళలో ఒక్క రోజులో 59,690 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 5,949 కొత్త కేసులు నమోదయ్యాయి. అలాగే, మరో 5,268 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇప్పటివరకు ఆ రాష్ట్రంలో మొత్తంగా 6.64లక్షల మందికి కరోనా సోకగా.. వారిలో 6.01లక్షల మందికి పైగా కోలుకున్నారు. తాజాగా మరో 32 మంది మరణించడంతో మొత్తం మృతుల సంఖ్య 2,594కి పెరిగింది. రాష్ట్రంలో ప్రస్తుతం 60,029 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

ఇదీ చూడండి:దేశంలో 3.6 లక్షల దిగువకు యాక్టివ్​ కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.