ETV Bharat / bharat

కూలిన వంతెన- ఎమ్మెల్యేకు త్రుటిలో తప్పిన ముప్పు - మాన్వి ఎమ్మెల్యే

కర్ణాటక రాయచూర్​లో ఓ వంతెన ఉన్నట్టుండి నేలకొరిగింది. స్థానిక ఎమ్మెల్యే తనిఖీలు చేస్తున్న సమయంలోనే బ్రిడ్జి కుప్పకూలింది. ఈ ఘటనలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

Close shave for Karnataka MLA as rain-damaged bridge collapses
ఆకస్మికంగా కూలిన వంతెన- నలుగురికి గాయాలు
author img

By

Published : Sep 29, 2020, 1:20 PM IST

కర్ణాటకలో ఓ వంతెన హఠాత్తుగా కుప్పకూలింది. రాయచూర్​ జిల్లాలో వరదల్లో దెబ్బతిన్న వంతెనను ఓ ఎమ్మెల్యే తనిఖీ చేస్తున్న తరుణంలో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు గాయపడ్డారు.

Close shave for Karnataka MLA as rain-damaged bridge collapses
కూలిన వంతెన వద్ద ఎమ్మెల్యే వెంకటప్ప నాయక్​

ఇదీ జరిగింది..

మాన్వి అసెంబ్లీ నియోజకవర్గ శాసనసభ్యుడు వెంకటప్ప నాయక్​.. రాయచూర్​లోని సిర్వారా ప్రాంతంలోగల దెబ్బతిన్న వంతెనను పర్యవేక్షించేందుకు వెళ్లారు. అనుచరులతో పాటు వెంకటప్ప పగుళ్లను పరిశీలిస్తుండగా.. ఒక్కసారిగా బ్రిడ్జి కూలిపోయింది. వంతెన అంచుభాగంలో నిల్చున్న నాయక్​కు త్రుటిలో ప్రమాదం తప్పింది.

వంతెనలో ఇరుక్కుపోయిన వారిని పైకి లాగుతున్న స్థానికులు

ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు గాయపడగా.. వారిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.

ఇదీ చదవండి: గుండె భాష వినండి- ప్రమాదాన్ని ముందే పసిగట్టండి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.