ETV Bharat / bharat

గుర్రంపై స్వారీ చేస్తూ బడికి వెళ్తున్న బుడతడు

'మనసుంటే మార్గముంటుంది' అని రుజువు చేశాడు మధ్యప్రదేశ్​కు చెందిన 12 ఏళ్ల బాలుడు. చదువుపై తనకున్న మక్కువతో ఎలాగైనా పాఠశాలకు వెళ్లాలని ఓ ప్రత్యేక మార్గాన్ని ఎంచుకున్నాడు.

kid going to school on horse
అశ్వంపై స్వారీ చేస్తూ పాఠశాలకు వెళ్తోన్న బాలుడు
author img

By

Published : Feb 9, 2021, 1:47 PM IST

కొందరు పిల్లలు బడికి ఆటోలో వెళ్తారు. మరికొందరు పాఠశాల బస్సులో వెళ్తుంటారు. కానీ, మధ్యప్రదేశ్​కు చెందిన ఓ బాలుడు మాత్రం తనకంటూ ప్రత్యేక మార్గం ఎంచుకున్నాడు. తమ ప్రాంతానికి బస్సులు రావని తెలిసి... ఎలాగైనా స్కూల్​కు వెళ్లాలని గుర్రపు స్వారీ మొదలుపెట్టాడు.

గుర్రపు స్వారీ చేస్తూ పాఠశాలకు వెళ్తోన్న శివరాజ్

ఇదీ జరిగింది....

బడి లేదు అనగానే సంబరపడిపోయే పిల్లలే ఎక్కువగా ఉంటారు. కానీ, మధ్యప్రదేశ్​ ఖండ్​వా ప్రాంతానికి చెందిన శివరాజ్​ మాత్రం అందరిలా కాదు. 'పాఠశాలకు వెళ్లడం అక్కర్లేదు ఇంటి దగ్గరే ఉండు' అని తన తండ్రి చెప్పినా ఒప్పుకోలేదు. చదువుపై ఉన్న మక్కువతో ఎలాగైనా పాఠశాలకు వెళ్లాలనుకున్నాడు. కానీ, సైకిల్​పై వెళ్తే కింద పడిపోతాడనే భయంతో ప్రత్యేక వాహనంపై తీసుకెళ్దామనుకున్నాడు బాలుడి తండ్రి. అయితే పెట్రోల్​, డీజిల్​ ఖర్చులు భరించేంత స్థోమత వారికి అసలే లేదు. ఈ నేపథ్యంలో శివరాజ్​ ప్రత్యేక మార్గం ఎంచుకున్నాడు. ఓ చిన్న గుర్రాన్ని కొనివ్వమని వాళ్ల నాన్నని అడిగాడు. దీనికి ఒప్పుకున్న బాలుడి తండ్రి శివరాజ్​కు అశ్వాన్ని కొనిచ్చాడు. అంతే... అందరిలా కాకుండా గుర్రంపై సవారీ చేస్తూ రాజసంగా పాఠశాలకు వెళ్తున్నాడు శివరాజ్.

ఇదీ చదవండి:'మంచు కురవడం వల్లే జలప్రళయం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.