" ఒక పత్రిక ఈ డైరీని విడుదల చేసింది. ఇందులోని ప్రతి పేజీలో యడ్యూరప్ప సంతకం ఉంది. ఇది కచ్చితంగా దర్యాప్తు చేయవల్సిన అంశం. 2017 నుంచి ఈ డైరీ ఆదాయ పన్ను శాఖ వద్ద ఉన్నట్లు సమాచారం. ఈ విషయంపై మోదీ దర్యాప్తుకు ఎందుకు ఆదేశించలేదని కచ్చితంగా ప్రశ్నించాలి. ఇప్పుడు ఈ డైరీ బయటకు వచ్చింది. ఇందులో ఉన్న సమాచారం నిజమా కాదా అనేది ప్రధాని తేల్చాలి. "
- రణ్‌దీప్ సింగ్ సుర్జేవాలా, కాంగ్రెస్ అధికార ప్రతినిధి
ఖండించిన యడ్యూరప్ప
వార్తా కథనాల ఆధారంగా కాంగ్రెస్ చేసిన ఆరోపణలను యడ్యూరప్ప ఖండించారు. మోదీకున్న ప్రజాదరణ చూసి ఓర్వలేకపోతున్నారని విమర్శించారు.
"కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదు. కోట్ల రూపాయలు చెల్లించానన్న ఆరోపణలపై ఇదివరకే దర్యాప్తు జరిగింది. పత్రాలు నకిలీవని తేలింది. వాటిలోని సమాచారం, చేతి రాత, సంతకాలు పూర్తిగా ఫోర్జరీ చేసినవని ఆదాయపన్ను శాఖ అధికారులు తేల్చారు. కాంగ్రెస్ అసత్య ఆరోపణలు చేస్తోంది.
- బీఎస్ యడ్యూరప్ప, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి