ETV Bharat / bharat

నేడు సీఐఐ వార్షికోత్సవంలో ప్రధాని ప్రసంగం

భారత పరిశ్రమల సమాఖ్య వార్షికోత్సవంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు పాల్గొననున్నారు. వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా జరిగే ఈ కార్యక్రమంలో 'గెట్టింగ్ గ్రోత్​ బ్యాక్' అనే అంశంపై ప్రధాని మాట్లాడనున్నారు.

modi
మోదీ
author img

By

Published : Jun 2, 2020, 5:37 AM IST

Updated : Jun 2, 2020, 7:24 AM IST

ఇవాళ జరగనున్న భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) 125వ వార్షికోత్సవంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొననున్నారు. కార్యక్రమంలో భాగంగా 'గెట్టింగ్ గ్రోత్ బ్యాక్'(వృద్ధిని తిరిగి సాధించడం) అనే అంశంపై మోదీ ప్రసంగించనున్నారు. లాక్​డౌన్ కారణంగా తాత్కాలికంగా మూతపడిన కంపెనీలు తిరిగి ప్రారంభమవుతున్న నేపథ్యంలో మోదీ ప్రసంగానికి ప్రాధాన్యం సంతరించుకుంది.

భారత పరిశ్రమల సమాఖ్య 1895లో ప్రారంభమైంది. ఈ ఏడాదికి 125 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా సంస్థ వార్షికోత్సవాన్ని నిర్వహిస్తోంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రోజంతా ఈ కార్యక్రమం జరగనుంది.

ఈ వార్షికోత్సవానికి పిరమల్ గ్రూప్ చైర్మన్ అజయ్ పిరమల్, ఐటీసీ లిమిటెడ్ సీఎండీ సంజీవ్ పూరి, బయోకాన్ సీఎండీ కిరణ్ మజుందార్-షా, ఎస్​బీఐ చైర్మన్ రజనీష్ కుమార్, కోటక్ మహీంద్రా బ్యాంక్ సీఈఓ ఉదయ్ కోటక్, సీఐఐ అధ్యక్షుడు విక్రమ్ కిర్లోస్కర్ పాల్గొన్ననున్నారు.

ఇదీ చదవండి: 'నిసర్గ'పై అమిత్​ షా సమీక్ష.. ఆ రాష్ట్రాలకు హామీ

Last Updated : Jun 2, 2020, 7:24 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.