బంగాల్ ఉత్తర దినాజ్‌పుర్‌లో సంచలనం సృష్టించిన బాలిక అత్యాచారం, హత్య కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో నిందితుడైన ఫిరోజ్ అలీ శవమై కనిపించాడు.
కలగచ్ ప్రాంతంలో బాలిక మృతదేహం లభ్యమైన చోటుకు 50 మీటర్ల సమీపంలో ఫిరోజ్ శవాన్ని గుర్తించారు పోలీసులు. శవపరీక్ష నిమిత్తం మృతదేహాన్ని ఇస్లామ్పుర్ సబ్‌డివిజన్ ఆస్పత్రికి తరలించారు. అతడు ఎలా మరణించాడనే కోణంలో దర్యాప్తు చేపట్టారు.
ఆదివారం తీవ్ర నిరసనలు
బాలిక హత్యాచారంపై ఆదివారం స్థానికులు తీవ్ర స్థాయిలో నిరసన చేపట్టారు. రహదారిపై బైఠాయించి, వాహన రాకపోకలు అడ్డుకున్నారు. పోలీసులు ప్రతిఘటించగా... ఆందోళనలు హింసాయుతంగా మారాయి. ఇది జరిగిన కొద్ది గంటలకే నిందితుడు శవమై కనిపించడం చర్చనీయాంశమైంది.
ఇదీ చదవండి: రెండు నెలలు కడుపులో కత్తెర్లతో...