శారదా కుంభకోణానికి సంబంధించి కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) మరోసారి సుప్రీంకోర్టు తలుపుతట్టింది. కోల్‌కతా మాజీ పోలీసు కమిషనర్ రాజీవ్ కుమార్ అరెస్టుపై ఫిబ్రవరి 5న విధించిన స్టేను తొలగించాలని అభ్యర్థించింది. ఆయనను కస్టడీకి తీసుకొని విచారించేందుకు అనుమతివ్వాలని సుప్రీంను కోరింది సీబీఐ.
ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయి నేతృత్వంలోని ధర్మాసనం నేడు సీబీఐ అభ్యర్థనలపై వాదనలు విననుంది.
సీబీఐ విచారణకు పూర్తిగా సహకరించాలని, దర్యాప్తునకు ఎలాంటి సమస్యలు సృష్టించకూడదని పశ్చిమ్ బంగ అధికారులకు సుప్రీంకోర్టు గతంలో ఉత్తర్వులు జారీ చేసింది. వీటిని తప్పకుండా అనుసరించేలా అధికారులను ఆదేశించాలని సీబీఐ కోరింది.
భౌతిక ఆధారాలను సేకరించటం సహా శారదా కుంభకోణం విచారణలో లభించిన సాక్ష్యాలను దాచి ఉంచిన అంశాలపై కోల్‌కతా మాజీ సీపీ రాజీవ్‌కుమార్ సహా మరికొందరిని విచారించాల్సిన అవసరం ఉంది - సీబీఐ